పాక్‌ ఓపెనర్‌ను ఔట్‌ చేసిన హార్దిక్‌.. సెలబ్రేషన్స్‌ వైరల్‌ | Hardik Pandya gives bye-bye send-off to Imam-ul-Haq after dismissing | Sakshi
Sakshi News home page

WC 2023: పాక్‌ ఓపెనర్‌ను ఔట్‌ చేసిన హార్దిక్‌.. సెలబ్రేషన్స్‌ వైరల్‌

Published Sat, Oct 14 2023 4:27 PM | Last Updated on Sat, Oct 14 2023 4:52 PM

Hardik Pandya gives bye-bye send-off to Imam-ul-Haq after dismissing - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా పాకిస్తాన్‌తో భారత్‌ తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మరోసారి తన బౌలింగ్‌తో​ జట్టును అదుకున్నాడు.

36 పరుగులతో క్రీజులతో పాతుకుపోయే ప్రయత్నం చేసిన పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌-హక్‌ను అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపాడు. తన వేసిన తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న హార్దిక్‌.. తన మూడో ఓవర్‌లో మాత్రం అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు.

పాక్‌ ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌లో మూడో బంతిని వైడ్‌ ఆఫ్‌స్టంప్‌ దిశగా వేశాడు. ఇమామ్‌ కవర్‌ డ్రైవ్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ రాహుల్‌ చేతికి వెళ్లింది. దీంతో ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లిపోయింది.

వెంటనే హార్దిక్‌ కూడా స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు. బంతిని చేతిలో పట్టుకుని నమస్కారం పెడుతూ ఇమామ్‌కు సెండాఫ్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: WC 2023- Ind vs Pak: పాక్‌ గుండు సున్నా.. రోహిత్‌ ఒక్కడే 27! ఇదీ మీ లెవల్‌ అంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement