పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరు ఏ మాత్రం మారలేదు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో రెడ్ బాల్ సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది.
దీంతో సర్వాత్ర పాక్ జట్టు, మెనెజ్‌మెంట్ విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా జరిగే రెండు టెస్టుకు ముందు తమ జట్టులో పలు మార్పులు పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సమా టీవీకి చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఖాదిర్ ఖవాజా రిపోర్ట్స్ ప్రకారం.. స్టార్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ను తిరిగి జట్టులోకి తీసుకు రావాలని పీసీబీ సెలక్షన్ కమిటీ యోచిస్తుందంట. అతడితో పాటు కమ్రాన్ గులామ్, మీర్ హంజా, నౌమాన్ అలీ, యువ ఓపెనర్ మహమ్మద్ హురైరాలను కూడా జట్టులో చేర్చనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇమామ్ ఉల్ హక్ చివరగా పాకిస్తాన్ తరపున గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడికి పాక్ జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటివరకు తరపున 24 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇమామ్..37.33 సగటుతో 1568 పరుగులు చేశాడు. అతడి టెస్టు కెరీర్‌లో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్ ఉతప్ప
Comments
Please login to add a commentAdd a comment