7 Wickets In T20: All Teams Beats Opposition By 7 Wickets October 18 Matches - Sakshi
Sakshi News home page

T20 World Cup: అరె... నాలుగు మ్యాచ్‌లలోనూ అదే ఫలితం!

Published Tue, Oct 19 2021 1:05 PM | Last Updated on Tue, Oct 19 2021 3:36 PM

T20 World Cup 2021: All Teams Beats Opposition By 7 Wickets October 18 Matches - Sakshi

T20 World Cup 2021: ఐసీసీ మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. గ్రూపు-ఏలో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ ఏడు వికెట్ల తేడాతో విజయం నమోదవడం విశేషం. అంతేకాదు.. ఇరు మ్యాచ్‌లలోనూ బౌలర్లే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచారు.

ఐర్లాండ్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌ (IRE Vs NED)
టీ20 ప్రపంచకప్‌-2021 క్వాలిఫయర్స్‌ పోటీల్లో భాగంగా అక్టోబరు 18న ఐర్లాండ్‌- నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో ఐర్లాండ్‌ ప్రత్యర్థి జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 4 వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్‌ పతనాన్ని శాసించిన కర్టిస్‌ కాంపర్‌కు ‘‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’’ అవార్డు లభించింది. అంతేకాదు అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కర్టిస్‌ ఘనత సాధించాడు.

స్కోర్లు: నెదర్లాండ్స్‌- 106 (20)
ఐర్లాండ్‌ 107/3 (15.1)

శ్రీలంక వర్సెస్‌ నమీబియా(SL Vs Nam)
ఇక శ్రీలంక- నమీబియా మ్యాచ్‌లోనూ.. దసున్‌ షనక సేన.. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు వికెట్లు పడగొట్టిన మహీశ్‌ తీక్షణ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

స్కోర్లు: నమీబియా- 96 (19.3)
శ్రీలంక 100/3 (13.3)

టీమిండియా- ఇంగ్లండ్‌ వార్మప్‌ మ్యాచ్‌లోనూ సేమ్‌..
జోస్‌ బట్లర్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌.. కోహ్లి సేన చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌ చేసిన కేఎల్‌ రాహుల్‌(52), ఇషాన్‌ కిషన్‌(70) అర్ధ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్‌ షమీ 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. 

స్కోర్లు: ఇంగ్లండ్‌- 188/5 (20)
టీమిండియా- 192/3 (19)

పాకిస్తాన్‌- వెస్టిండీస్‌ వార్మప్‌ మ్యాచ్‌లో కూడా..
డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌- పాకిస్తాన్‌ మధ్య సోమవారం వార్మప్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో బాబర్‌ ఆజం బృందం ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజం అర్ధ సెంచరీ సాధించగా... ఫఖార్‌ జమాన్‌ మెరుగ్గా రాణించాడు.

స్కోర్లు: విండీస్‌- 130/7 (20)
పాకిస్తాన్‌ 131/3 (15.3)

చదవండి: T20 WC IND vs PAK: బాబర్‌ అజమ్‌ బ్యాటింగ్‌.. రెప్పవాల్చని టీమిండియా ఆటగాళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement