కింగ్‌స్టన్: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఫవాద్ ఆలమ్(213 బంతుల్లో 124 నాటౌట్; 17 ఫోర్లు) అజేయ శతకానికి, కెప్టెన్ బాబర అజామ్(174 బంతుల్లో 75; 13 ఫోర్లు) అర్థశతకం తోడవడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్థాన్ 302/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వీరికి తోడు మహమ్మద్ రిజ్వాన్(115 బంతుల్లో 31), ఫహీమ్ అష్రఫ్ (78 బంతుల్లో 28) మాత్రమే కాస్త పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జైడన్ సీల్స్ మూడేసి వికెట్లు తీయగా, జేసన్ హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులు మాత్రమే సాధించి ఎదురీదుతోంది. ఓపెనర్లు క్రైగ్ బ్రాత్ వైట్(4), కీరన్ పోవెల్(5), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రోస్టన్ చేజ్(10) తీవ్రంగా నిరాశపర్చగా.. క్రీజులో బోన్నర్(18 బ్యాటింగ్), అల్జారీ జోసెఫ్(0 బ్యాటింగ్) ఉన్నారు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. ఫహీమ్ అష్రఫ్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. తొలి రోజు కొన్ని ఓవర్ల ఆటకు అంతరాయం కలగగా.. రెండో రోజు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మూడో రోజైన ఆదివారం కూడా వర్షం మధ్య మధ్యలో అంతరాయం కలిగించింది. కాగా, రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య జట్టు వికెట్ తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్..
Comments
Please login to add a commentAdd a comment