Fawad Alam
-
పాకిస్తాన్‌కు బై బై.. యూఎస్ఏకు వలస వెళ్లిన స్టార్ క్రికెటర్
పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఫవాద్ ఆలమ్ తన సొంత దేశానికి బై బై చెప్పాడు. ఆట పరంగా స్వదేశంలో సరైన అవకాశాలు రాకపోవడంతో అతను యూఎస్ఏకు వలస వెళ్లాడు. తన తదుపరి కెరీర్‌ను యూఎస్ఏతోనే కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. దీనికి సంబంధించి అన్ని లాంఛనాలు కూడా పూర్తయ్యాయని తెలిపాడు. మైనర్ లీగ్ క్రికెట్ టీ20 తదుపరి సీజన్లో తాను చికాగో కింగ్స్‌మెన్ తరఫున బరిలోకి దిగుతానని తెలిపాడు. ఇకపై తాను, తన దేశానికి చెందిన సమీ అస్లాం, హమ్మద్ ఆజమ్, సైఫ్ బదార్, మొహమ్మద్ మోహిసిన్లలా యూఎస్ఏ క్రికెటర్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. పాక్ తరఫున 15 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు క్రిక్‌బజ్ కథనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కాగా, 37 ఫవాద్ ఆలం 2007లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం (వన్డే) చేసి 2009 వరకు దాదాపుగా డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. అనంతరం 2009లో టెస్ట్ అరంగేట్రం చేసిన ఫవాద్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి వార్తల్లో నిలిచాడు. తొలి టెస్ట్‌లోనే సెంచరీ చేసినప్పటికీ ఆతర్వాతి టెస్ట్‌ల్లో స్థానం దక్కించుకోలేకపోయిన ఫవాద్, తిరిగి మరో ఛాన్స్ కోసం 11 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2020లో తిరిగి పాక్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న ఫవాద్.. రీ ఎంట్రీలో అదరగొట్టాడు. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వేలపై సెంచరీలు చేసి అప్పట్లో పాక్ స్టార్ టెస్ట్ క్రికెటర్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఆతర్వాతి మ్యాచ్‌ల్లో వరుసగా వైఫల్యాల బాట పట్టిన ఫవాద్ 2022 జులై పాక్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అవకాశాల కోసం నిరీక్షించిన అతను.. ఇక వెయిట్ చేసి ఉపయోగం లేదని తన మకాంను పాక్ నుంచి యూఎస్ఏకు మార్చాడు. పాక్ తరఫున 19 టెస్ట్‌లు, 38 వన్డేలు, 24 టీ20 ఆడిన ఫవాద్.. పాక్ 2009లో గెలిచిన టీ20 ప్రపంచకప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఫవాద్ తన కెరీర్లో 5 టెస్ట్ సెంచరీలు, ఓ వన్డే సెంచరీ, 2 టెస్ట్ హాఫ్‌సెంచరీలు, 6 వన్డే హాఫ్ సెంచరీలు చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్ బౌలర్ అయిన ఫవాద్ టెస్ట్‌ల్లో 2, వన్డేల్లో 5, టీ20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. -
లంక క్రికెటర్‌తో పవాద్ ఆలం వైరం.. ఇలా కూడా గొడవ పడొచ్చా!
శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లా, పాక్ క్రికెటర్ పవాద్ ఆలం మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. గొడవ సీరియస్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. సరదాగా గొడవ పడిన ఈ ఇద్దరి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరోషన్ డిక్వెల్లా పవాద్ ఆలంను ఉద్దేశించి ఏదో అనగా.. దానికి పవాద్ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన లంక కెప్టెన్ కరుణరత్నే, పాక్ పేసర్ హారిస్ రౌఫ్‌లు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందా అని చూడడానికి వచ్చారు. గొడవ కాదని కేవలం ఫన్నీగా జరుగుతున్న సంభాషణ అని తెలుసుకొని వాళ్లు కూడా ఈ గొడవలో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోనూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ట్విటర్లో షేర్ చేసింది. ఇక పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి ఓవరాల్‌గా 323 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కెప్టెన్ కరుణరత్నే (27), ధనంజయ (30) నిలకడగా ఆడుతున్నారు. తొలి టెస్టులో పాక్ 342 పరుగుల లక్ష్య చేధనను సులువుగా చేధించడంతో ఈసారి మాత్రం అవకాశం ఇవ్వకూడదని లంక భావిస్తోంది. అందుకే పాక్‌కు భారీ టార్గెట్ ఇచ్చే యోచనలో ఉన్నారు. Buddies off the field 🤝#SLvPAK #SpiritofCricket pic.twitter.com/YuwsG50EPf — Pakistan Cricket (@TheRealPCB) July 26, 2022 చదవండి: ICC Men's Cricket Committee: ఐసీసీలో వివిఎస్ లక్ష్మణ్‌కు కీలక పదవి -
SL Vs Pak: ఇది టెస్టు మ్యాచ్.. టీ20 కాదు.. వాళ్లిద్దరిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?
SL Vs Pak 1st Test- “It’s a Test match, not a T20 game” - Kamran Akmal: రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో శనివారం(జూలై 16) గాలే వేదికగా మొదటి మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ బౌలర్లు షాహిన్ ఆఫ్రిది మూడు వికెట్లు, హసన్ అలీ రెండు, యాసిర్ షా రెండు వికెట్లతో చెలరేగారు. నసీమ్ షా, మహ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. దీంతో మూడో సెషన్ సమయానికి లంక 9 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. మహీశ్ తీక్షణ, కసున్ రజిత క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ తుదిజట్టులో ఫవాద్ ఆలం, ఫాహీమ్ అష్రఫ్‌లకు చోటు ఇవ్వకపోవడంపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మండిపడ్డాడు. ఇదేమీ టీ20 మ్యాచ్ కాదు.. టెస్టు క్రికెట్ అంటూ మేనేజ్మెంట్ను విమర్శించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా.. ‘‘ఇది టెస్టు మ్యాచ్.. టీ20 గేమ్ కాదు... చాలా మంది ఆల్‌రౌండర్లు ఆడుతున్నట్లున్నారు.. నిజానికి టెస్టు క్రికెట్కంటూ కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు. ఫవాద్ ఆలం, ఫాహీమ్ అష్రఫ్‌లను శ్రీలంకతో మ్యాచ్‌కు ఎందుకు తప్పించడం నన్ను విస్మయానికి గురిచేసింది’’ అని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు. It’s a test match not a T20 game…too many Allrounders playing and what i think is test match game is all about specialists…its pretty shocking why @iamfawadalam25 and @iFaheemAshraf both have been dropped 🤔 #PAKvsSL — Kamran Akmal (@KamiAkmal23) July 16, 2022 కాగా ఆలం ఇప్పటి వరకు 18 టెస్టులాడి 986 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ ఆల్‌రౌండర్ ఫాహీమ్ 14 టెస్టు మ్యాచ్‌లలో 24 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 636 పరుగులు సాధించాడు. ఇలా ఇద్దరూ టెస్టు క్రికెట్లో సత్తా చాటారు. ఈ నేపథ్యంలో కమ్రాన్ అక్మల్ ఈ మేరకు ట్వీట్ చేయడం గమనార్హం. శ్రీలంకతో మొదటి టెస్టు ఆడుతున్న పాక్ జట్టు: అబ్దుల్లా షఫిక్, ఇమామ్ ఉల్ హక్, అజర్ అలీ, బాబర్ ఆజం(కెప్టెన్), ఆఘా సల్మాన్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, యాసిర్ షా, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, నసీమ్ షా. శ్రీలంక తుదిజట్టు: ఒషాడో ఫెర్నాండో, దిముత్ కరుణరత్నె(కెప్టెన్), కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనుంజయ డి సిల్వా, దినేశ్ చండిమాల్, నిరోషన్ డిక్విల్లా(వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, మహీశ్ తీక్షణ, ప్రభాత్ జయసూర్య, కసున్ రజిత. చదవండి: Lalit Modi- Sushmita Sen: తనకంటే తొమ్మిదేళ్లు పెద్దది.. మినాల్‌ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్! చివరికి ఇలా! Sri Lanka won the toss and elected to bat first: 🔴 LIVE | 1st Test - Day 1 | #SLvPAK https://t.co/oru4bTD9it — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 16, 2022 -
పాక్ క్రికెటర్‌కు విచిత్ర పరిస్థితి.. 28 ఏళ్ల రికార్డు బద్దలు
పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు ఫేలవ డ్రాగా ముగిసింది. జీవం లేని పిచ్‌పై ఐదు రోజుల పాటు బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్నారు. ఒక రోజు మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. వెరసి నాలుగురోజుల్లో ఒక్కసారి కూడా పిచ్ బౌలింగ్‌కు సహకరించలేదు. అటు పాక్ ఓపెనర్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాదడం.. ఇటు ఆస్ట్రేలియా కూడా ధీటుగా బదులివ్వడం వెనువెంటనే జరిగిపోయింది. దీంతో మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. పాక్ జట్టులో 10 మంది ఆటగాళ్లు ఏదో ఒక దశలో మ్యాచ్‌లో ఉపయోగపడ్డారు.. అది బౌలింగ్, బ్యాటింగ్.. లేదా ఫీల్డింగ్‌లో క్యాచ్ అందుకోవడం ఇలా ఏదో ఒకటి చేశారు. కానీ అదే జట్టులో ఉన్న పవాద్ ఆలమ్ విచిత్రమైన రికార్డును మూట గట్టుకున్నాడు. ఐదు రోజుల పాటు టెస్టు మ్యాచ్ ఆడిన పవాద్ ఆలమ్ ఒక్కసారి కూడా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో(క్యాచ్‌లు) అవకాశం రాని ఆటగాడిగా మిగిలిపోయాడు. పాకిస్తాన్ రెండు ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేయగా.. పవాద్ ఆలమ్‌కు ఒక్కసారి కూడా బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఇక ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో ఆలమ్ కనీసం బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక ఫీల్డింగ్‌లో ఖవాజా క్యాచ్ రూపంలో ఒకసారి చాన్స్ వచ్చినప్పటికి ఇక్కడ కూడా పవాద్ ఆలమ్‌ను దురదృష్టం వెంటాడింది. తోటి ఫీల్డర్‌తో సమన్వయ లోపం కారణంగా ఎవరు క్యాచ్ అందుకోలేకపోయారు. అలా పవాద్ ఆలమ్ 28 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఇంతకముందు 1994లో పాక్ క్రికెటర్ ఆసిఫ్ ముజ్తబాకు ఇదే పరిస్థితి ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన అప్పటి టెస్టు మ్యాచ్‌లో ముజ్తబా ఒక్కసారి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయలేదు. తాజాగా పవాద్ ఆలమ్ ముజ్తబా సరసన చేరాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఊరికే ఉంటారా.. పవాద్పై ట్రోల్స్‌తో విరుచుకుపడ్డారు. '' ఐదు రోజులు చాయ్ తాగావు.. బిస్కెట్లు తిన్నావు.. ఇంకేం చేయలేదు.. ''అదృష్టం అంటే నీదే.. ఏం చేయకుండానే రూ. 7.6 లక్షలు(ఒక టెస్టు మ్యాచ్) సొంతం చేసుకున్నావు''.. ''పవాద్ ఆలమ్ది దురదృష్టమా.. అదృష్టమా''..''ఇంత చిత్రమైన పరిస్థితి ఏ క్రికెటర్‌కు రావొద్దు''.. ''ఐదు రోజులు అలా వచ్చాడు.. ఇలా వెళ్లాడు'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: New Rules Of Cricket 2022: ఇకపై మన్కడింగ్ నిషేధం.. క్రికెట్లో కొత్త రూల్స్ Aus Vs Pak: టెస్టుల్లో చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా! Fun Fact: Fawad Alam is first Pakistan player in 28 years to go a complete Test without batting, bowling, catching. Last was Asif Mujtaba vs New Zealand in Wellington in 1994. #PakvAus — Mazher Arshad (@MazherArshad) March 8, 2022 I feel sorry for Fawad Alam. He’s the only one who hasn’t got to bat on this pitch🥲 #PAKvAUS — hazharoon (@hazharoon) March 8, 2022 Fawad Alam bags 7.6 lakh rupees as match fees without getting to bat, without bowling and without taking a catch. Dream job. #PakvAus #Cricket — Farooq Khan (@khanfarooq993) March 8, 2022 -
10 వికెట్ల ప్రదర్శనతో 10 స్థానాలు మెరుగుపర్చుకుని టాప్-10లోకి..
దుబాయ్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాక్ ఆటగాళ్లు దుమ్మురేపారు. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్న అనంతరం విడుదలైన ఈ ర్యాంకింగ్స్‌లో పాక్ సంచలన పేసర్ షాహిన్ అఫ్రిది, రెండో టెస్ట్ సెంచరీ హీరో ఫవాద్ ఆలమ్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తమతమ స్థానాలను మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ ర్యాంకులను సాధించారు. విండీస్‌తో రెండో టెస్ట్‌లో పది వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన షాహిన్ అఫ్రిది ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ స్థానానికి ఎగబాకగా, బాబర్ ఆజమ్ ఓ ప్లేస్ మెరుగుపర్చుకుని 7వ స్థానానికి, ఫవాద్ ఆలమ్ 34 స్థానాలు మెరుగుపర్చుకుని 21వ ప్లేస్‌కు ఎగబాకారు. Shaheen Afridi launches up in the @MRFWorldwide ICC Men’s Test Bowling rankings after his stellar series in the West Indies 🚀 Full list: https://t.co/zWeR1wwvYA pic.twitter.com/jnAesHzo9v — ICC (@ICC) August 25, 2021 బ్యాటింగ్ విభాగంలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లు టాప్-10లో తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. కోహ్లి(776), రోహిత్(773) ఐదు, ఆరు స్థానాల్లో నిలువగా, పంత్(724) ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో ప్లేస్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(901) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(893) రెండో స్థానాన్ని, ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్(891) మూడో ప్లేస్‌ను పదిలం చేసుకున్నారు. Pakistan captain Babar Azam has climbed a spot on the @MRFWorldwide ICC Men’s Test Batting rankings ⬆️ Full list: https://t.co/17s2PmICbp pic.twitter.com/uFHHbpeRAE — ICC (@ICC) August 25, 2021 ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఈ కేటగిరీలో ఆసీస్ స్టార్ పేసర్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 848 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. వీరి తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ పేసర్ సౌథీ(824), ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(816), కివీస్ పేసర్ నీల్ వాగ్నర్(810), ఇంగ్లండ్ స్టార్ పేసర్ అండర్సన్(800) వరుసగా మూడు, నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. చదవండి: కోహ్లి, రూట్ కొట్టుకున్నంత పని చేశారట..! -
ఫవాద్ ఆలమ్ అజేయ శతకం.. పటిష్ట స్థితిలో పాక్
కింగ్స్టన్: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఫవాద్ ఆలమ్(213 బంతుల్లో 124 నాటౌట్; 17 ఫోర్లు) అజేయ శతకానికి, కెప్టెన్ బాబర అజామ్(174 బంతుల్లో 75; 13 ఫోర్లు) అర్థశతకం తోడవడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్థాన్ 302/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వీరికి తోడు మహమ్మద్ రిజ్వాన్(115 బంతుల్లో 31), ఫహీమ్ అష్రఫ్ (78 బంతుల్లో 28) మాత్రమే కాస్త పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జైడన్ సీల్స్ మూడేసి వికెట్లు తీయగా, జేసన్ హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులు మాత్రమే సాధించి ఎదురీదుతోంది. ఓపెనర్లు క్రైగ్ బ్రాత్ వైట్(4), కీరన్ పోవెల్(5), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రోస్టన్ చేజ్(10) తీవ్రంగా నిరాశపర్చగా.. క్రీజులో బోన్నర్(18 బ్యాటింగ్), అల్జారీ జోసెఫ్(0 బ్యాటింగ్) ఉన్నారు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. ఫహీమ్ అష్రఫ్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. తొలి రోజు కొన్ని ఓవర్ల ఆటకు అంతరాయం కలగగా.. రెండో రోజు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మూడో రోజైన ఆదివారం కూడా వర్షం మధ్య మధ్యలో అంతరాయం కలిగించింది. కాగా, రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య జట్టు వికెట్ తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. -
ZIM Vs PAK: ఫవాద్ ఆలమ్ అజేయ సెంచరీ
హరారే: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఫవాద్ ఆలమ్ (155 బంతుల్లో 108 బ్యాటింగ్; 16 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించడంతో... జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ పటిష్ట స్థితికి చేరుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 103/0 తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 374 పరుగులు సాధించింది. ప్రస్తుతం పాకిస్తాన్ 198 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓపెనర్లు ఇమ్రాన్ బట్ (91; 7 ఫోర్లు), ఆబిద్ అలీ (60; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించి తొలి వికెట్‌కు 115 పరుగులు జత చేశారు. అదే విధంగా.. అజహర్ అలీ (36; 5 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (45; 4 ఫోర్లు) కూడా రాణించారు. కెరీర్లో నాలుగో టెస్టు సెంచరీ చేసిన ఫవాద్ ఆలమ్‌తో కలిసి ప్రస్తుతం హసన్ అలీ (21 బ్యాటింగ్; ఫోర్, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నాడు. జింబాబ్వే బౌలర్లలో డొనాల్డ్ తిరిపానో మూడు వికెట్లు తీసుకున్నాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: SL vs BAN: శ్రీలంక భారీ స్కోరు Covid-19: ధావన్ రూ. 20 లక్షలు, ఉనాద్కట్ 30 లక్షలు ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇంకా ఆశే నిలబెడుతుంది: క్రికెటర్ ఆవేదన
కరాచీ: తాను దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నప్పటికీ తనపై ఎందుకింత వివక్ష అని ప్రశ్నిస్తున్నాడు పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఫవాద్ అలామ్. తనను అసలు సెలక్షన్ కమిటీలో పట్టించుకో పోవడంతో అలామ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చివరిసారి 2009లో పాకిస్తాన్ తరఫున ఆడిన అలామ్.. దేశవాళీ మ్యాచ్‌ల్లో 164 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 12, 106 పరుగులు చేశాడు. దాదాపు 57.00 సగటుతో ఉన్నప్పటికీ పీసీబీ సెలక్టర్లు మాత్రం అలామ్‌ను విస్మరిస్తున్నారు. దాంతో అలామ్ స్థానిక వార్తా చానల్‌తో మాట్లాడుతూ తన మనసులో మాటను వెల్లడించాడు. ‘ నన్ను కనీసం పరిగణలోకి తీసుకోక పోవడం బాధిస్తుంది. మనం సత్తాచాటుకున్న పట్టించుకోలేకపోతే బాధ అనేది సహజంగానే వస్తుంది. నన్ను ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకైతే తెలీదు. కానీ నేను ఆశ కోల్పోలేదు. నన్ను ఆశే నిలబెడుతుంది. ప్రపంచంలో నిలవాలంటే ఆశే ముఖ్యం. ఆ ఆశే నన్ను ఇంకా రాటుదేలేలా చేస్తుంది’ అని ఫవాద్ అలామ్ తెలిపాడు. పాకిస్తాన్ తరఫున మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడిన అలామ్.. ఇటీవల ఖ్వాయిద్ ఈ అజామ్ ట్రోఫీలో సింధ్ తరఫున ఆడి డబుల్ సెంచరీ చేసి తాను రేసులో ఉన్నానని సెలక్టర్లకు చెప్పకనే చెప్పాడు. కానీ పాకిస్తాన్ సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు. అయితే తాను మళ్లీ పాకిస్తాన్ తరఫున ఆడతాననే ఆశతో ఉన్నాడు అలామ్. అంతకుముందు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ దృష్టికి సైతం ఇదే విషయాన్ని తీసుకెళ్లానని చెప్పాడు. కాకపోతే అలామ్ ఏమీ చెప్పలేదని సర్ఫరాజ్ అంటున్నాడు.