ZIM Vs PAK: ఫవాద్‌ ఆలమ్‌ అజేయ సెంచరీ  | ZIM Vs PAK Fawad Alam Hit Century Helps Pakistan Leads On 2nd Day | Sakshi
Sakshi News home page

ZIM Vs PAK: ఫవాద్‌ ఆలమ్‌ అజేయ సెంచరీ

Published Sat, May 1 2021 8:39 AM | Last Updated on Sat, May 1 2021 8:42 AM

ZIM Vs PAK Fawad Alam Hit Century Helps Pakistan Leads On 2nd Day - Sakshi

హరారే: మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఫవాద్‌ ఆలమ్‌ (155 బంతుల్లో 108 బ్యాటింగ్‌; 16 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించడంతో... జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్‌ పటిష్ట స్థితికి చేరుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 103/0 తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 374 పరుగులు సాధించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌ 198 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓపెనర్లు ఇమ్రాన్‌ బట్‌ (91; 7 ఫోర్లు), ఆబిద్‌ అలీ (60; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించి తొలి వికెట్‌కు 115 పరుగులు జత చేశారు.

అదే విధంగా.. అజహర్‌ అలీ (36; 5 ఫోర్లు), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (45; 4 ఫోర్లు) కూడా రాణించారు. కెరీర్‌లో నాలుగో టెస్టు సెంచరీ చేసిన ఫవాద్‌ ఆలమ్‌తో కలిసి ప్రస్తుతం హసన్‌ అలీ (21 బ్యాటింగ్‌; ఫోర్, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నాడు. జింబాబ్వే బౌలర్లలో డొనాల్డ్‌ తిరిపానో మూడు వికెట్లు తీసుకున్నాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.    

చదవండి: SL vs BAN: శ్రీలంక భారీ స్కోరు
Covid-19: ధావన్‌ రూ. 20 లక్షలు, ఉనాద్కట్‌ 30 లక్షలు
ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement