Pak Vs Aus: Fawad Alam Break 28 Years Old Record Without Batting, Bowling, And Catching - Sakshi
Sakshi News home page

Trolls On Fawad Alam: పాక్‌ క్రికెటర్‌కు విచిత్ర పరిస్థితి.. 28 ఏళ్ల రికార్డు బద్దలు

Published Wed, Mar 9 2022 10:24 AM | Last Updated on Wed, Mar 9 2022 11:35 AM

Fawad Alam Break 28 Years Old Record Without Batting-Bowling-Catching - Sakshi

పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు ఫేలవ డ్రాగా ముగిసింది. జీవం లేని పిచ్‌పై ఐదు రోజుల పాటు బ్యాట్స్‌మెన్‌ పండగ చేసుకున్నారు. ఒక రోజు మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. వెరసి నాలుగురోజుల్లో ఒక్కసారి కూడా పిచ్‌ బౌలింగ్‌కు సహకరించలేదు. అటు పాక్‌ ఓపెనర్‌ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాదడం.. ఇటు ఆస్ట్రేలియా కూడా ధీటుగా బదులివ్వడం వెనువెంటనే జరిగిపోయింది. దీంతో మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. 

పాక్‌ జట్టులో  10 మంది ఆటగాళ్లు ఏదో ఒక దశలో మ్యాచ్‌లో ఉపయోగపడ్డారు.. అది బౌలింగ్‌, బ్యాటింగ్‌.. లేదా ఫీల్డింగ్‌లో క్యాచ్‌ అందుకోవడం ఇలా ఏదో ఒకటి చేశారు. కానీ అదే జట్టులో ఉన్న పవాద్‌ ఆలమ్‌ విచిత్రమైన రికార్డును మూట గట్టుకున్నాడు. ఐదు రోజుల పాటు టెస్టు మ్యాచ్‌ ఆడిన పవాద్‌ ఆలమ్‌ ఒక్కసారి కూడా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో(క్యాచ్‌లు) అవకాశం రాని ఆటగాడిగా మిగిలిపోయాడు.  

పాకిస్తాన్‌ రెండు ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్‌ చేయగా.. పవాద్‌ ఆలమ్‌కు ఒక్కసారి కూడా బ్యాటింగ్‌ అవకాశం రాలేదు. ఇక ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ సమయంలో ఆలమ్‌ కనీసం బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఇక ఫీల్డింగ్‌లో ఖవాజా క్యాచ్‌ రూపంలో ఒకసారి చాన్స్‌ వచ్చినప్పటికి ఇక్కడ కూడా పవాద్‌ ఆలమ్‌ను దురదృష్టం వెంటాడింది. తోటి ఫీల్డర్‌తో సమన్వయ లోపం కారణంగా ఎవరు క్యాచ్‌ అందుకోలేకపోయారు. అలా పవాద్‌ ఆలమ్‌ 28 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఇంతకముందు 1994లో పాక్‌ క్రికెటర్‌ ఆసిఫ్ ముజ్తబాకు ఇదే పరిస్థితి ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన అప్పటి టెస్టు మ్యాచ్‌లో ముజ్తబా ఒక్కసారి బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ చేయలేదు. తాజాగా పవాద్‌ ఆలమ్‌ ముజ్తబా సరసన చేరాడు. 

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఊరికే ఉంటారా.. పవాద్‌పై ట్రోల్స్‌తో విరుచుకుపడ్డారు. '' ఐదు రోజులు చాయ్‌ తాగావు.. బిస్కెట్లు తిన్నావు.. ఇంకేం చేయలేదు.. ''అదృష్టం అంటే నీదే.. ఏం చేయకుండానే రూ. 7.6 లక్షలు(ఒక టెస్టు మ్యాచ్‌) సొంతం చేసుకున్నావు''.. ''పవాద్‌ ఆలమ్‌ది దురదృష్టమా.. అదృష్టమా''..''ఇంత చిత్రమైన పరిస్థితి ఏ క్రికెటర్‌కు రావొద్దు''.. ''ఐదు రోజులు అలా వచ్చాడు.. ఇలా వెళ్లాడు'' అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: New Rules Of Cricket 2022: ఇకపై మన్కడింగ్‌ నిషేధం.. క్రికెట్‌లో కొత్త రూల్స్

Aus Vs Pak: టెస్టుల్లో చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement