Pakistan Beat West Indies by 8 Runs Clinch T20 Series - Sakshi
Sakshi News home page

WI vs PAK: చెలరేగిన షాహిన్‌ అఫ్రిది.. పాకిస్తాన్‌దే టి20 సిరీస్‌

Published Wed, Dec 15 2021 8:00 AM | Last Updated on Wed, Dec 15 2021 10:21 AM

Pakistan Beat West Indies By 8 Runs Clinch T20 Series - Sakshi

కరాచీ: వెస్టిండీస్‌తో రెండో టి20 క్రికెట్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలుత పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రిజ్వాన్‌ (38; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఇఫ్తిఖార్‌ అహ్మద్‌ (32; 1 ఫోర్, 2 సిక్స్‌లు), హైదర్‌ అలీ (31; 4 ఫోర్లు) రాణించారు. విండీస్‌ 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్‌ కింగ్‌ (67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), షెపర్డ్‌ (35 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు. చివరి ఓవర్లో గెలుపు కోసం 23 పరుగులు చేయాల్సిన స్థితిలో వెస్టిండీస్‌ 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది 3 వికెట్లు తీశాడు. చివరి టి20 గురువారం జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement