దుబాయ్: ప్రతిష్టాత్మక వార్షిక అవార్డు ఎంపిక ప్రక్రియలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ‘ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ నామినేషన్ల వివరాలను ప్రకటించింది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ‘రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ’ పేరిట ఇచ్చే ఈ అవార్డు కోసం నాలుగు పేర్లను ఐసీసీ నామినేట్ చేసింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ అవార్డు కోసం పోటీ పడుతోంది.
చదవండి: Kohli Vs BCCI: 'కోహ్లి మాటల్లో నిజం లేదు.. టి20 కెప్టెన్‌గా తప్పుకోవద్దని సూచించాం'
ఈ జాబితాలో స్మృతితో పాటు బీమాంట్ (ఇంగ్లండ్), లిజెల్లి లీ (దక్షిణాఫ్రికా), గ్యాబీ లెవిస్ (ఐర్లాండ్) ఉన్నారు. ఈ ఏడాది స్మృతి 22 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కలిపి 38.86 సగటుతో 855 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన ‘పింక్ టెస్టు’లో సెంచరీ చేసిన స్మృతి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.
పాకిస్తాన్ నుంచి ఇద్దరు...
ఐసీసీ అవార్డుల్లో అన్నింటికంటే మేటిగా భావించే ‘మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ నామినేషన్లను ఐసీసీ ప్రకటించింది. ‘సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ’ పేరిట ఇచ్చే ఈ అవార్డు కోసం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మొహమ్మద్ రిజ్వాన్, పేస్ బౌలర్ షాహిన్ అఫ్రిది పోటీ పడుతున్నారు.
చదవండి: IND Vs SA: తొలి టెస్టు విజయం.. టీమిండియాకు ఐసీసీ షాక్
Comments
Please login to add a commentAdd a comment