
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 78 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. పాక్ ఓపెనర్లు ఇమాముల్ హక్(2), ఫకార్ జమాన్(22), హరీస్ సోహైల్(8), బాబర్ అజమ్(22), సర్పరాజ్ అహ్మద్(8), ఇమాద్ వసీం(1), షాదబ్ ఖాన్(0)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు.
(ఇక్కడ చదవండి: వెస్టిండీస్ 7..పాకిస్తాన్ 3)
కాట్రెల్ వేసిన మూడో ఓవర్‌లో ఇమాముల్ హక్ ఔట్ కాగా, ఆండ్రీ రసెల్ వేసిన ఆరో ఓవర్‌లో ఫకార్ జమాన్ పెవిలియన్ బాటపట్టాడు. రసెల్ వేసిన 10వ ఓవర్‌లో సోహైల్ ఔట్ కాగా, ఓష్నే థామస్ వేసిన 14వ ఓవర్‌లో బాబర్ అజమ్ పెవిలియన్ చేరాడు. ఇక సర్ఫరాజ్ అహ్మద్, ఇమాద్ వసీంలను జేసన్ హోల్డర్ ఔట్ చేయగా, ఓష్నే థామస్ బౌలింగ్‌లో షాదబ్ ఖాన్ పెవిలియన్ చేరాడు. కట్టుదిట్టమైన వెస్టిండీస్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఆపసోపాలు పడుతున్న పాకిస్తాన్ స్వల్ప విరామాల్లో కీలక వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు శిబిరంలో ఒత్తిడి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment