Babar Azam breaks Virat Kohli's BIG Record - Sakshi
Sakshi News home page

PAK vs WI: వన్డేల్లో బాబర్‌ ఆజాం అరుదైన ఫీట్‌.. తొలి కెప్టెన్‌గా..!

Published Thu, Jun 9 2022 12:46 PM | Last Updated on Thu, Jun 9 2022 3:28 PM

Babar Azam breaks Virat Kohlis BIG Record - Sakshi

వన్డే క్రికెట్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్‌గా అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా​ బాబర్ రికార్డులకెక్కాడు. ముల్తాన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 103 పరుగులు చేసిన బాబర్‌.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతకుమందు ఈ ఘనత టీమిండియా స్టార్‌ ఆటగాడు,మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి ఈ రికార్డును 17 ఇన్నింగ్స్‌లలో సాధించగా.. బాబర్‌ కేవలం 13 ఇన్నింగ్స్‌లోనే తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా బాబర్‌ నిలిచాడు.

విరాట్ కోహ్లి వర్సెస్‌ బాబర్ ఆజం:
బాబర్‌ ఆజాం 86 వన్డేల్లో 17 సెంచరీలు సాధించగా.. కోహ్లి 260 వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు.
బాబర్ ఆజం కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లోనే కెప్టెన్‌గా అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
కోహ్లి 17 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు.
విరాట్ కోహ్లీ వన్డే సగటు 58.07 కాగా, బాబర్ ఆజం సగటు 59.78.
బాబర్ ఆజం రెండు సార్లు హ్యాట్రిక్ సెంచరీలు సాధించాడు
చదవండి: PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్‌ కెప్టెన్‌.. తొలి ఆటగాడిగా..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement