పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తన క్రీడా స్పూర్తితో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ బాబర్ ఆజాం(103) సెంచరీతో చెలరేగి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో బాబర్ ఆజాంకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే బాబర్ అందరనీ ఆశ్చర్యపరుస్తూ.. తనకు దక్కిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ ఖుష్దిల్ షాకు బాబర్ అందజేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బాబర్ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఖుష్దిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అఖరి ఓవర్ వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో.. కేవలం 23 బంతుల్లోనే 41 పరుగులు సాధించి జట్టుకు ఖుష్దిల్ అద్భుతమైన విజయాన్ని అందించాడు.
పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మొదటి వన్డే:
♦టాస్- వెస్టిండీస్- బ్యాటింగ్
♦వెస్టిండీస్ స్కోరు: 305/8 (50)
♦పాకిస్తాన్ స్కోరు: 306/5 (49.2)
♦విజేత: పాకిస్తాన్.. 5 వికెట్ల తేడాతో పర్యాటక విండీస్‌పై విజయం
చదవండి: PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్.. తొలి ఆటగాడిగా..!
Beautiful gesture from the skipper 😍@babarazam258 gives his player of the match award to @KhushdilShah_ 🏆👏#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/7BrSiV7TyL
— Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022
Comments
Please login to add a commentAdd a comment