ICC World Cup Super League Pakistan Vs West Indies: వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగబోయే వన్డే సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రకటించింది. జూన్ 8 నుంచి జూన్ 12 వరకు మూడు వన్డేలు ఆడనున్నట్లు పేర్కొంది. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.
ఐసీసీ వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి పీసీబీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రావల్పిండిలో ఈ మ్యాచ్‌లు జరుగనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ సూపర్‌లీగ్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జూన్ 8 నుంచి 12 మధ్య జరిగే సిరీస్‌కు రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం వెస్టిండీస్ జట్టు జూన్ 5న ఇస్లామాబాద్‌కు చేరుకుంటుంది.
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో డిసెంబరు 2021లో జరగాల్సిన ఈ సిరీస్‌ను రీ షెడ్యూల్ చేసేందుకు ఇరు వర్గాల అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు అప్పుడు జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా 2023లో వీలైనంత త్వరగా ఆడటానికి విండీస్ బోర్డు అంగీకారం తెలిపింది. ఇందుకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తాం’’ అని పీసీబీ వెల్లడించింది.
పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ వన్డే సిరీస్
రావల్పిండిలోని పిండి స్టేడియం వేదికగా మూడు
తొలి వన్డే: జూన్ 8
రెండో వన్డే: జూన్ 10
మూడో వన్డే: జూన్ 12
చదవండి: IPL 2022: ఎవరీ ఆయుష్ బదోని.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు
IPL 2022 GT Vs LSG: అతడొక సంచలనం; తను నన్ను అవుట్ చేశాడు, నేను గెలిచా.. కుటుంబం మొత్తం హ్యాపీ: హార్దిక్ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment