West Indies To Tour Pakistan 3 T20s 3 ODIs Schedule: వెస్టిండీస్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటన ఖరారైంది. ఈ ఏడాది డిసెంబరులో విండీస్ జట్టు పాక్ టూర్‌కు వెళ్లనుంది. మూడు టీ20 మ్యాచ్‌లు సహా 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబరు 9న పాకిస్తాన్‌కు చేరనున్న వెస్టిండీస్ పురుషుల జట్టు... 13 నుంచి 22 వరకు పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఈ విషయాన్ని క్రికెట్ వెస్టిండీస్ గురువారం ధ్రువీకరించింది.
కాగా ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఈ మేరకు విండీస్ జట్టు పాక్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఇక ఇప్పటి వరకు నాలుగు విజయాలు, ఐదు పరాజయాలతో ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్.. ఎలాగైనా ఈ సిరీస్‌లో గెలుపొంది తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని భావిస్తోంది. విండీస్ కంటే ఒక స్థానం మెరుగ్గా ఉన్న పాక్ సైతం సిరీస్ విజయంపై కన్నేసింది.
ఇక 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. వన్డే మ్యాచ్ మొదలు కావడానికి కొన్ని నిమిషాల ముందు టూర్‌ను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించలేమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ సైతం ఇదే బాటలో నడవడంతో కివీస్ బోర్డు తీరుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు సహా మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
దారుణంగా దెబ్బకొట్టిన న్యూజిలాండ్‌పై టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో ప్రతీకారం తీర్చుకోవాలని సూచించారు. అందుకు అనుగుణంగానే పాకిస్తాన్.. విలియమ్సన్ సేనపై అద్బుత విజయం సాధించింది. కాగా భద్రతా కారణాలను చూపి కివీస్, ఇంగ్లండ్ టూర్ రద్దు చేసుకున్న నేపథ్యంలో.. విండీస్ మాత్రం పాక్ పర్యటనకు వెళ్లనుండటం గమనార్హం. 2018 తర్వాత వెస్టిండీస్ పాక్‌లో పర్యటించనుండటం ఇదే తొలిసారి.
పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్:
►డిసెంబరు 9న కరాచికి చేరుకోనున్న వెస్టిండీస్ జట్టు.. అన్ని మ్యాచ్‌లు అక్కడే ఆడనుంది.
►డిసెంబరు 13- మొదటి టీ20
►డిసెంబరు 14- రెండో టీ20
►డిసెంబరు 16- మూడో టీ20
►డిసెంబరు 18- మొదటి వన్డే
►డిసెంబరు 20- రెండో వన్డే
►డిసెంబరు 22- మూడో వన్డే.
చదవండి: T20 WC Aus Vs Ban: బంగ్లాదేశ్ మరో చెత్త రికార్డు.. కెన్యా, అఫ్గనిస్తాన్ సరసన
Details of West Indies tour of Pakistan#PAKvWI | #HarHaalMainCricket pic.twitter.com/H5f8Dp2uHA
— Pakistan Cricket (@TheRealPCB) November 4, 2021
Comments
Please login to add a commentAdd a comment