ఉమ్రాన్ మాలిక్, షోయబ్ అక్తర్
Umran Malik- Shoaib Akhtar: ’రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ పేరిట ఉన్న రికార్డును తప్పక బద్దలు కొడతానని టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అన్నాడు. అత్యంత వేగంతో బంతిని విసిరి అక్తర్‌ను అధిగమిస్తానని ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ధీమా వ్యక్తం చేశాడు. అయితే, వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే తనకు మరింత ముఖ్యమని పేర్కొన్నాడు.
కాగా శ్రీలంకతో స్వదేశంలో సిరీస్‌ల నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ టీ20, వన్డే జట్లకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో న్యూస్ 24తో మాట్లాడిన 23 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్‌కు అక్తర్ రికార్డు గురించి ప్రశ్న ఎదురుకాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నా ధ్యాస మొత్తం దానిమీదే
‘‘అదృష్టవశాత్తూ అంతా సాఫీగా జరిగి.. నా ప్రదర్శన బాగుంటే షోయబ్ అక్తర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొడతాను. అయితే, నేను రికార్డుల గురించి మాత్రం ఆలోచించడం లేదు. నా మొదటి ప్రాధాన్యం జట్టు ప్రయోజనాలే. దేశం కోసం ఆడటమే. నిజానికి మ్యాచ్ జరుగుతున్న సమయంలో మనమెంత వేగంగా బంతిని విసిరామనే సంగతి తెలియదు.
మ్యాచ్ ముగిసిన తర్వాతే ఈ విషయాలు తెలుసుకోగలుగుతాం. నా ధ్యాస.. ఎంత వేగంతో బంతిని విసురుతున్నామన్న అంశం మీద కాకుండా సరైన ఏరియాలో బంతి పడుతుందా లేదో అంచనా వేసి విసరడం మీదే ఉంటుంది’’ ఉమ్రాన్ మాలిక్ చెప్పుకొచ్చాడు. కాగా జనవరి 3 నుంచి భారత్- లంక జట్ల మధ్య తొలి టీ20తో సిరీస్ మొదలుకానుంది.
అక్తర్ పేరిట రికార్డు
అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన రికార్డు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. 2003 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతడు గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇక ఉమ్రాన్ సాధారణంగా సుమారు 150 కిమీ/గంటకు పైగా వేగంతో బంతిని విసరడగలన్న సంగతి తెలిసిందే.
చదవండి: Ind Vs SL 2023: శ్రీలంకతో టీమిండియా సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్, జట్లు, ఇతర వివరాలు
హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేస్తారా? బీసీసీఐకి వార్నింగ్ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్
Comments
Please login to add a commentAdd a comment