
షాకైన కోహ్లి (PC: Twitter/ Disney+Hotstar)
Virat Kohli Goes Dumbstruck: టీమిండియాతో రెండో వన్డేలో శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ ఫర్వాలేదనిపించాడు. గత మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్‌లో డకౌట్ అయిన ఈ వికెట్ కీపర్.. కోల్‌కతా మ్యాచ్‌లో 34 పరుగులు చేయగలిగాడు. అయితే, 18 ఓవర్ మొదటి బంతికి టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతికి చిక్కి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ఇక ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్‌లో మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న మెండిస్ 34 పరుగులు(3 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో)చేశాడు. అయితే, టీమిండియా పేస్ యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో అతడు కొట్టిన ఏకైక సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. లంక ఇన్నింగ్స్‌లో 16 ఓవర్ ఉమ్రాన్ వేశాడు.
వారెవ్వా! కోహ్లి షాక్!
ఈ క్రమంలో మూడో బంతిని అద్భుత రీతిలో మెండిస్ సిక్స్‌గా మలిచాడు. ఉమ్రాన్ సంధించిన షార్ట్ బాల్‌ను డీప్ ఫైన్ లెగ్ మీదుగా షాట్ బాదాడు. ఇక మెండిస్ కొట్టిన సిక్స్ చూసి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆశ్చర్యపోయాడు. ‘ఇదెలా సాధ్యమైందిరా బాబు’ అన్నట్లుగా నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని.. షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అరంగేట్ర ఓపెనర్ నువానీడు ఫెర్నాండో(50), మెండిస్(34) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో లంక 215 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో వన్డేలో శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన రోహిత్ సేన.. సిరీస్ విజయమే లక్ష్యంగా ఛేదనకు దిగనుంది. ఇక ఇప్పటికే గువహటి మ్యాచ్‌లో భారీ విజయం సాధించి ఆతిథ్య భారత్ 1-0తో సిరీస్‌లో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.
చదవండి: IND vs SL: లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్! కానీ పాపం..
IPL 2023: ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా 'బేబీ ఏబీడీ'.. మరి రోహిత్?
— cricket fan (@cricketfanvideo) January 12, 2023
Comments
Please login to add a commentAdd a comment