
కరాచీ: వెస్టిండీస్‌తో జరిగిన మూడు టి20ల సిరీస్‌ను పాకిస్తాన్ 3–0తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లో పాక్ 7 వికెట్లతో విండీస్‌ను చిత్తు చేసింది. విండీస్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (64), బ్రూక్స్ (49), బ్రెండన్ కింగ్ (43) చెలరేగారు. అనంతరం పాక్ 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు సాధించింది. రిజ్వాన్ (87), బాబర్ ఆజమ్ (79) జట్టును గెలిపించారు.
మరో ముగ్గురికి కోవిడ్ వచ్చినా...
గురువారం ఉదయం ముగ్గురు విండీస్ ఆటగాళ్లు షై హోప్, అకీల్ హొసీన్, జస్టిన్ గ్రీవ్స్ కరోనా పాజిటివ్‌గా తేలారు. టి20 సిరీస్ ప్రారంభానికి ముందే ముగ్గురు క్రికెటర్లు కాట్రెల్, ఛేజ్, మేయర్స్ కరోనా బారిన పడ్డారు. టీమ్‌లోని ఆరుగురు ఆటగాళ్లు కోవిడ్‌తో బాధపడుతుండటంతో విండీస్ పూర్తి జట్టును బరిలోకి దింపగలదా అనే అనుమానం కనిపించింది.
అయితే ఏదో రకంగా చివరి టి20 ఆడే విధంగా విండీస్‌ను పాక్ బోర్డు ఒప్పించగలిగింది. అయితే శనివారంనుంచి జరగాల్సిన వన్డే సిరీస్‌ను ప్రస్తుతానికి రద్దు చేసి జూన్ 2022లో మళ్లీ జరిపేందుకు ఇరు బోర్డులు అంగీకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment