పాక్‌దే టి20 సిరీస్ | Pakistan beat West Indies by 17 runs in second T20, win series 2-0 | Sakshi
Sakshi News home page

పాక్‌దే టి20 సిరీస్

Published Mon, Sep 26 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

పాక్‌దే టి20 సిరీస్

పాక్‌దే టి20 సిరీస్

 దుబాయ్: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలుండగానే కై వసం చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ 16 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది. మీడియం పేసర్లు సోహైల్ తన్వీర్ (3/13), హసన్ అలీ (3/49) పాక్‌ను గెలిపించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. సర్ఫరాజ్ అహ్మద్ (32 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు), ఖాలిద్ లతీఫ్ (36 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్), షోయబ్ మాలిక్ (28 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులే చేయగలిగింది. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ నిరాశపరచగా... చివర్లో సునీల్ నరైన్ (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. పాక్ 2-0తో సిరీస్‌ను కై వసం చేసుకోగా... చివరి టి20 మ్యాచ్ మంగళవారం జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement