
గయానా: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ జట్టుకు షాక్ తగలింది. రెండో టీ20 మ్యాచ్‌కు ముందు శనివారం పాకిస్తాన్ ఆటగాడు అజమ్‌ఖాన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని తలకు బలమైన గాయం తగిలింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వెంటనే అజమ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పీసీబీ తెలిపింది. అజమ్‌కు వైద్యులు సిటీ స్కాన్ నిర్వహించారని.. ప్రస్తుతం అతను అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు పేర్కొంది. కాగా 24 గంటల తర్వాత అజమ్ గాయం తీవ్రతపై ఒక అంచనా వస్తుందని పీబీబీ తెలిపింది.
కాగా అజమ్ బ్యాటింగ్ సమయంలో హెల్మట్ ధరించినప్పటికి.. బంతి వేగంగా రావడంతో తలకు బలంగా తగిలింది. కాగా విండీస్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన తొలి టీ20 వర్షార్పణంతో రద్దైంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 9 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 నేడు జరగనుంది.