పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 12) సాయంత్రం జరిగిన తొలి సెమీస్‌లో పాక్ టీమ్.. వెస్టిండీస్ ఛాంపియన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ యూనిస్ ఖాన్ (65), కమ్రాన్ అక్మల్ (46), ఆమెర్ యామిన్ (40 నాటౌట్), సోహైల్ తన్వీర్ (33) సత్తా చాటగా.. షాహిద్ అఫ్రిది (1), షోయబ్ మాలిక్ (0), మిస్బా ఉల్ హక్ (0) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో ఫిడేల్ ఎడ్వర్డ్స్ 3, సులేమాన్ బెన్ 2, జెరోమ్ టేలర్, డ్వేన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటై, ఓటమిపాలైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఆష్లే నర్స్ (36) టాప్ స్కోరర్‌గా కాగా.. డ్వేన్ స్మిత్ (26), క్రిస్ గేల్ (22), రయాద్ ఎమ్రిట్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సోహైల్ ఖాన్ 4, వాహబ్ రియాజ్, షోయబ్ మాలిక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. రెండో సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment