చెలరేగిన బ్యాటర్లు.. విండీస్‌ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌ | WCL 2024: West Indies Champions Beat England Champions By 5 Wickets, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

WCL 2024: చెలరేగిన బ్యాటర్లు.. విండీస్‌ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌

Published Tue, Jul 9 2024 9:06 PM | Last Updated on Wed, Jul 10 2024 4:57 PM

WCL 2024: West Indies Champions Beat England Champions By 5 Wickets

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2024లో భాగంగా ఇవాళ (జులై 9) వెస్టిండీస్‌ ఛాంపియన్స్‌, ఇంగ్లండ్‌ ఛాంపియన్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విండీస్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. ఇయాన్‌ బెల్‌ (64 బంతుల్లో 97; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రవి బొపారా (30 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కెవిన్‌ పీటర్సన్‌ (19 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో శామ్యుల్‌ బద్రీ, జేరోమ్‌ టేలర్‌, ఆష్లే నర్స్‌, డారెన్‌ స్యామీ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌.. చాడ్విక్‌ వాల్టన్‌ (42 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆష్లే నర్స్‌ (25 బంతుల్లో 47 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించడంతో 19.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో సమిత్‌ పటేల్‌ 2, రవి బొపారా, ఉస్మాన్‌ అఫ్జల్‌, సైడ్‌ బాటమ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరగా.. మిగతా రెండు బెర్త్‌ల కోసం ఇండియా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా పోటీపడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement