అదరగొట్టిన అలీ.. పాక్‌ ఘన విజయం | Brilliant Hasan Ali gives Pakistan the series | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన అలీ.. పాక్‌ ఘన విజయం

Published Mon, Apr 3 2017 3:31 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

అదరగొట్టిన అలీ.. పాక్‌ ఘన విజయం

అదరగొట్టిన అలీ.. పాక్‌ ఘన విజయం

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ తో జరిగిన నాలుగు టి20ల సిరీస్ ను 3-1తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ లో విండీస్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి సిరీస్ దక్కించుకుంది. టాస్  ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 124 పరుగులు చేసింది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. వాల్టన్(40), బ్రాత్ వైట్(37), శామ్యూల్స్(22) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు.

పాక్ బౌలర్లలో హసన్ అలీ 4 ఓవర్లు వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రెండు మేడిన్ ఓవర్లు వేశాడు. షదబ్ ఖాన్ 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. 125 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 19 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 127 పరుగులు సాధించింది. అహ్మద్ షెహజాద్(53), కమ్రాన్ అక్మల్(20), బాబర్ ఆజామ్(38) రాణించారు. హసన్ అలీకి ’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. షదబ్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement