Asif Afridi: ఆసీస్‌తో మూడు వన్డేలు, ఏకైక టీ20 కోసం 20 మంది సభ్యుల పాకిస్థాన్ జట్టును పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఇవాళ (మార్చి 17) ప్రకటించింది. ఈ జట్టులో అన్ క్యాప్డ్ అటగాళ్లు ఆసిఫ్ అఫ్రిది, మహ్మద్ హరీస్‌లు తొలిసారి చోటు దక్కించుకున్నారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ఆసిఫ్ అఫ్రిది (35), వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన హరీస్ (20) ఇటీవల ముగిసిన పీఎస్‌ఎల్‌లో(పాకిస్థాన్ సూపర్ లీగ్) అద్భుతంగా రాణించి, సెలెక్టర్ల దృష్టిలో పడ్డారు. పీఎస్‌ఎల్‌లో అఫ్రిది 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లతో సత్తా చాటగా, హరీస్ 186కి పైగా స్ట్రయిక్ రేట్‌తో చెలరేగిపోయాడు.
కాగా, ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు పాక్ కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ కొనసాగనుండగా, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిలు కీలక ఆటగాళ్లుగా వ్యవహరించనున్నారు. మరోవైపు పాక్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.
పాక్ వన్డే జట్టు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, అసిఫ్ అఫ్రిది, ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రౌఫ్, హసన్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, ఇమామ్ ఉల్ హాక్, కుష్దిల్ షా, మహ్మద్ హరీస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్
టీ20 జట్టు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, అసిఫ్ అఫ్రిది, ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రౌఫ్, హసన్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, కుష్దిల్ షా, మహ్మద్ హరీస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్
చదవండి: ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం.. పాక్-ఆసీస్ సిరీస్‌పై నీలినీడలు..!
Comments
Please login to add a commentAdd a comment