పాకిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించింది. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌కు తొలిసారిగా సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. పాక్‌తో మూడో వన్డేకు కూడా ఇంగ్లిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.
కాగా ఆస్ట్రేలియా ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా నవంబరు 4- నవంబరు 18 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.
జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్‌గా
ఇక శుక్రవారం(నవంబరు 8) అడిలైడ్ వేదికగా ఆసీస్- పాక్ మధ్య రెండో వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం కీలక ప్రకటన చేసింది. పాక్‌తో ఆఖరి వన్డేతో పాటు.. టీ20 సిరీస్‌కు జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.
ప్యాట్ కమిన్స్ అందుకే దూరం
కాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఇరుజట్లకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో పాక్‌తో రెండో వన్డే ముగిసిన తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ తదితరులు జట్టుకు దూరం కానున్నారు.
వీరంతా భారత్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధం కానున్నారు. ఇక వీరి గైర్హాజరీ నేపథ్యంలో పేసర్లు స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్, వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ వన్డే జట్టుతో చేరనున్నారు. ఇదిలా ఉంటే.. జోష్ ఇంగ్లిస్‌కు గతంలో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది.
వన్డేల్లో 30వ సారథిగా
అయితే, సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడం మాత్రమ ఇదే మొదటిసారి. ఇక తాజా నియామకంతో ఆస్ట్రేలియా జట్టుకు వన్డేల్లో 30వ, టీ20లకు పద్నాలుగో కెప్టెన్‌గా ఇంగ్లిస్ చరిత్రకెక్కనున్నాడు. ఇంగ్లిస్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలడనే నమ్మకం తమకు ఉందని ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ పేర్కొన్నాడు.
అదే విధంగా.. జట్టులోని సీనియర్లు ఆడం జంపా, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్ నుంచి ఇంగ్లిస్‌కు పూర్తి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఆసీస్ టీ20 రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ పాక్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
పాకిస్తాన్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్ - మొదటి రెండు మ్యాచ్‌లకు), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్ - మూడవ మ్యాచ్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్ (మూడవ మ్యాచ్ మాత్రమే), కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్ (రెండవ మ్యాచ్ మాత్రమే), స్పెన్సర్ జాన్సన్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మార్నస్ లబుషేన్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే), గ్లెన్ మాక్స్‌వెల్, లాన్స్ మోరిస్, జోష్ ఫిలిప్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే మాత్రమే), మిచెల్ స్టార్క్ (తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే), మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా.
పాకిస్తాన్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టు
సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా.
Comments
Please login to add a commentAdd a comment