నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ముందుగా పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు పది మ్యాచ్‌ల్లో ఎదురుపడగా విండీస్ ఏడింటిలో నెగ్గగా, పాకిస్తాన్‌కు మూడింటిలో విజయం సాధించింది.
మరొకవైపు జేసన్ హోల్డర్ నేతృత్వంలో ప్రస్తుత వెస్టిండీస్ బలంగానే ఉంది. నాలుగు నెలల క్రితం సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను వన్డేల్లో నిలువరించింది. నిలకడగా ఆడే షై హోప్, దూకుడుగా బాదే హెట్‌మైర్ జట్టుకు మరింత బలాన్ని చేకూర్చారు. గేల్‌కు తోడుగా ఇన్నింగ్స్ ప్రారంభించే ఎవిన్ లూయిస్ సైతం భారీ షాట్లతో హడలెత్తించగలడు. మిడిలార్డర్‌లో డారెన్ బ్రావో ఫామ్ అందుకోవాల్సి ఉంది. రోచ్, కాట్రెల్ ప్రధాన పేసర్ల పాత్ర పోషించనున్నారు. ఇక బౌలింగ్ ఆల్‌రౌండర్లు హోల్డర్, రసెల్ పాత్ర కీలకం కానుంది.
(ఇక్కడ చదవండి: ఈ క్యాచ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..)
ఇదిలా ఉంచితే పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వరల్డ్‌కప్ ప్రాక్టీస్ మ్యాచ్ సహా గత పది వన్డేల్లో పాక్ ఓటమి పాలైంది. మిడిలార్డర్ నుంచి మెరుగైన ప్రదర్శన లేకపోవడం ఒక కారణమైతే, బౌలింగ్‌లో పదును తగ్గడం మరో కారణం. ఓపెనర్లు ఇమాముల్ హక్, ఫఖర్ జమాన్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ ఫామ్‌తోనే ఆ జట్టు అడపా దడపా విజయాలు సాధిస్తుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారీ పరుగులు చేసినా పేలవమైన బౌలింగ్ కారణంగా సిరీస్‌ను పాక్ కోల్పోయింది.
తుది జట్లు
పాకిస్తాన్
సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఇమాముల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ అజమ్, హరీస్ సోహైల్, మహ్మద్ హఫీజ్, ఇమాద్ వసీం, షాదబ్ ఖాన్, హసన్ అలీ, మహ్మద్ అమిర్, వహబ్ రియాజ్
వెస్టిండీస్
జేసన్ హోల్డర్(కెప్టెన్), క్రిస్ గేల్, షాయ్ హోప్, డారెన్ బ్రేవో, హెట్‌మైర్, నికోలస్ పూరన్, ఆండ్రీ రసెల్, కార్లోస్ బ్రాత్‌వైట్, ఆశ్లే నర్స్, షెల్డాన్ కాట్రెల్, ఓష్నే థామస్
Comments
Please login to add a commentAdd a comment