
Three Pakistan Women Cricketers Tested For Covid Positive: పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపింది. జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. స్వదేశంలో విండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో జట్టు సభ్యులుండగా రొటీన్ చెకప్‌లో భాగంగా జరిపిన పరీక్షల్లో విషయం వెలుగు చూసినట్లు పేర్కొంది.
అయితే, కోవిడ్ బారిన పడిన ఆటగాళ్ల వివరాలను మాత్రం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించలేదు. బాధితులను 10 రోజుల క్వారంటైన్‌కు తరలించామని.. మిగతా జట్టు సభ్యులను వారి నుంచి వేరుగా ఉంచామని తెలిపింది. కాగా, పాక్ మహిళా జట్టు కరాచీ వేదికగా నవంబర్ 8, 11, 14 తేదీల్లో విండీస్‌తో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాక్ జట్టులో కరోనా కలకలం రేగడంతో ఈ సిరీస్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.
చదవండి: బీసీసీఐ బాస్ కీలక నిర్ణయం.. 'ఆ పదవికి' రాజీనామా