Pak Vs WI: Pakistan Beat West Indies By 63 Runs In 1st T20I Lead In Series- Sakshi
Sakshi News home page

Pak Vs WI: విండీస్‌ 137 పరుగులకే ఆలౌట్‌.. పాకిస్తాన్‌ ఘన విజయం

Published Tue, Dec 14 2021 9:28 AM | Last Updated on Tue, Dec 14 2021 9:43 AM

Pak Vs WI: Pakistan Beat West Indies By 63 Runs In 1st T20I Lead In Series - Sakshi

PC: PCB

T20 Series- Pakistan Won In 1st T20 Against West Indies: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా పాక్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (52 బంతుల్లో 78; 10 ఫోర్లు), హైదర్‌ అలీ (39 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా...చివర్లో నవాజ్‌ (10 బంతుల్లో 30 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.

అనంతరం విండీస్‌ 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. షై హోప్‌ (26 బంతుల్లో 31; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. వసీమ్‌ (4/40), షాదాబ్‌ ఖాన్‌ (3/17) ప్రత్యర్థిని పడగొట్టారు. హైదర్‌ అలీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్‌ 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో మ్యాచ్‌ నేడు ఇదే మైదానంలో జరుగుతుంది. 

స్కోర్లు:
పాకిస్తాన్‌- 200/6 (20)
వెస్టిండీస్‌- 137 (19)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement