Haider Ali
-
ఇదేమి ఔట్రా అయ్యా.. పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్
పాకిస్తాన్ ఆటగాడు హైదర్ అలీ టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్పాడు. హైదర్ అలీ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీల్లో బీజీబీజీగా ఉన్నాడు. కౌంటీల్లో డెర్బీషైర్ క్రికెట్ క్లబ్‌కు హైదర్ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2లో భాగంగా డర్హామ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదర్ ఊహించని రీతిలో ఔటయ్యాడు. ఏం జరిగిందంటే? డెర్బీషైర్ ఇన్నింగ్స్ 77 ఓవర్ వేసిన స్కాట్ బోర్త్విక్ బౌలింగ్‌లో రెండో బంతిని హైదర్ అలీ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకి వెనుక్కి వెళ్లింది. దీంతో వికెట్ కీపర్‌తో పాటు బౌలర్ కూడా ఎల్బీకి అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అని తల ఊపాడు. అయితే హైదర్ అలీ మాత్రం కనీసం బంతి ఎక్కడ ఉందో చూసుకోకుండా రన్ కోసం ముందుకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన వికెట్ కీపర్ రాబిన్సన్ వెంటనే స్టంప్స్‌ను పడగొట్టాడు. ఈ క్రమంలో ఫీల్డ్అంపైర్ థర్ఢ్ అంపైర్‌కు రీఫర్ చేశారు. పలు కోణాల్లో రీప్లేను పరిశీలించిన థర్ఢ్ అంపైర్ స్టంపౌట్‌గా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లు పలు విధాలగా స్పందిస్తున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ.. పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే.. కొంచెం కూడా తెలివుండదు అని కామెంట్ చేశారు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హైదర్ అలీ 38 పరుగులు చేశాడు.! చదవండి: Dravid- Kohli: విండీస్‌తో ప్రత్యేక మ్యాచ్.. కోహ్లిపై ద్రవిడ్ ప్రశంసల జల్లు! ఆ మూడు గుణాల వల్లే.. Not a dismissal Haider Ali will want to see again any time soon 😬 #CountyCricket2023pic.twitter.com/gFgvMXx8Wj — Wisden (@WisdenCricket) July 19, 2023 -
Pak Vs Eng: ఇదేంట్రా బాబు.. ఇలా కొట్టేశావు! వీడియో వైరల్
Pakistan vs England, 6th T20I - Viral Video: ఇంగ్లండ్‌తో పాకిస్తాన్ ఆరో టీ20 సందర్భంగా అంపైర్ అలీమ్ దర్‌కు గాయమైంది. కాసేపు నొప్పితో విలవిల్లాడిన అతడు.. తర్వాత అంపైరింగ్ కొనసాగించాడు. కాగా ఏడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పాకిస్తాన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆరో టీ20లో తొలుత ఆతిథ్య జట్టు బ్యాటింగ్ చేసింది. ఇందులో భాగంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హైదర్ అలీ.. ఆరో ఓవర్లో రిచర్డ్ గ్లీసెన్ బౌలింగ్‌లో పుల్‌షాట్ బాదాడు. ఆ సమయంలో లెగ్ అంపైర్ స్థానంలో ఉన్న అలీమ్ దర్ తొడ వెనుక భాగంలో బంతి గట్టిగా తగిలింది. అయితే, అదృష్టవశాత్తూ అతడికి పెద్దగా గాయమేమీ కాలేదు. కొన్ని క్షణాల పాటు నొప్పితో బాధపడిన అలీమ్ వెంటనే సర్దుకుని మళ్లీ తన డ్యూటీలోకి దిగాడు. ఇక బౌలర్ రిచర్డ్ అలీమ్ దగ్గరకు వెళ్లి పరామర్శించగా.. పర్లేదు అంతా బాగానే ఉంది అన్నట్లుగా అతడు సమాధానమిచ్చాడు. ఇదేంట్రా బాబు ఇలా కొట్టేశావు ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇదేంట్రా బాబు ఇలా కొట్టేశావు అన్నట్లుగా ఆ అంపైర్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఏదేమైనా అతడికి ప్రమాదం తప్పింది. ఫైనల్‌గా పాక్ మ్యాచ్ ఓడింది’’ అని మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ విధ్వంసకర ఆట తీరుతో చెలరేగడంతో ఇంగ్లండ్.. పాక్ విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని సూనాయాసంగా ఛేదించింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 3-3తో సమం చేసింది. ఇదిలా ఉంటే.. పాక్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లిన హైదర్ అలీ.. కళ్లు తిరిగినట్లుగా అనిపించడంతో కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అయినప్పటికీ ఈ యువ బ్యాటర్ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. చదవండి: Irani Cup 2022: కుప్పకూలిన సౌరాష్ట్ర టాపార్డర్.. 0,4,0,1,2... 98 పరుగులకే ఆలౌట్ Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్ Ouch! 😬#PAKvENG | #UKSePK pic.twitter.com/DaD6EwSaVV — Pakistan Cricket (@TheRealPCB) September 30, 2022 -
PSL 2022: పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై కరోనా పంజా..
కరాచీ: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2022పై కరోనా మహమ్మారి పంజా విసిరింది. లీగ్‌లో పాల్గొనబోయే నలుగురు క్రికెటర్లు సహా ఆ దేశ దిగ్గజ బౌలర్, కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రెసిడెంట్ వసీం అక్రమ్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ నెల 27 నుంచి ప్రారంభంకావాల్సిన లీగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కోవిడ్ బారిన పడిన ఆటగాళ్లలో పెషావర్ జల్మీకి చెందిన వాహబ్ రియాజ్, హైదర్ అలీ ఉన్నారు. అంతకుముందు ఇదే ఫ్రాంచైజీకి చెందిన కమ్రాన్ అక్మల్, అర్షద్ ఇక్బాల్‌లకు కూడా కరోనా వచ్చింది. వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కాగా, కొద్ది రోజుల క్రితం వివిధ ఫ్రాంచైజీలకు చెందిన ముగ్గురు క్రికెటర్లు, ఐదుగురు సహాయక సిబ్బంది వైరస్ బారిన పడినట్లు పీసీబీ గతంలో ప్రకటించింది. చదవండి: 145 కిమీ పైగా స్పీడ్‌తో బౌల్ చేసే ఆ బౌలర్‌ని ఏ జట్టైనా కోరుకుంటుంది.. కేఎల్ రాహుల్ -
Pak Vs WI: విండీస్ 137 పరుగులకే ఆలౌట్.. పాకిస్తాన్ ఘన విజయం
T20 Series- Pakistan Won In 1st T20 Against West Indies: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (52 బంతుల్లో 78; 10 ఫోర్లు), హైదర్ అలీ (39 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా...చివర్లో నవాజ్ (10 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. అనంతరం విండీస్ 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. షై హోప్ (26 బంతుల్లో 31; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. వసీమ్ (4/40), షాదాబ్ ఖాన్ (3/17) ప్రత్యర్థిని పడగొట్టారు. హైదర్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో మ్యాచ్ నేడు ఇదే మైదానంలో జరుగుతుంది. స్కోర్లు: పాకిస్తాన్- 200/6 (20) వెస్టిండీస్- 137 (19) Player of the match @iamhaideraly reviews his 68-run innings.#PAKvWI #HumTouKhelainGey pic.twitter.com/WSw3OxZsXN — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021 It's a WRAP from the National Stadium Karachi! Pakistan win by 63 runs and go 1-0 in three-match #PAKvWI T20I series.#HumTouKhelainGey pic.twitter.com/QqGvlhgauZ — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021 But falls to @76Shadabkhan shortly after pic.twitter.com/UnejzC7gKw — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021 -
పాకిస్తాన్ టి20 జట్టులో మూడు మార్పులు.. ఆ ముగ్గురికి చోటు
3 Players Added In Pakistan T20 Worldcup Team.. టి20 ప్రపంచకప్ 2021 ప్రారంభానికి ముందు పాకిస్తాన్ తన జట్టులో మూడు మార్పులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫఖర్ జమాన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్, మిడిలార్డర్ బ్యాటర్ హైదర్ అలీ జట్టులోకి వచ్చారు. కాగా ముందు ప్రకటించిన జట్టులో సర్ఫరాజ్‌తో హైదర్ అలీకి చోటు లేదు. అజమ్ ఖాన్, మహ్మద్ హస్నైన్ల స్థానంలో వీరిద్దరు చోటు దక్కించుకోగా.. ఇక ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న ఫఖర్ జమాన్‌ను కుష్దిల్ షా స్థానంలో జట్టులోకి ఎంపిక చేశారు. తాజాగా జరిగిన నేషనల్ టి20 కప్‌లో ప్రదర్శన ఆధారంగా ఈ ముగ్గురిని తుది జట్టులోకి తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ ముహముద్ వసీమ్ పేర్కొన్నారు. ''ఈ ముగ్గురు నేషనల్ టి20 కప్‌లో ఆకట్టుకున్నారు. వాళ్ల అనుభవం ప్రస్తుతం జట్టుకు ఎంతో అవసరం. వీరు చేరడం వల్ల జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ఇక అజమ్ ఖాన్, కుష్దిల్ షా, హస్నైన్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న టి20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను టీమిండియాతో అక్టోబర్ 24న ఆడనుంది. టి20 ప్రపంచకప్ పాకిస్తాన్ 15మందితో కూడిన జట్టు బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, సోహైబ్ మక్సూద్ రిజర్వ్ ఆటగాళ్లు- కుష్దిల్ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్ -
దీనిని 'క్యాచ్ ఆఫ్ ది సమ్మర్' అనొచ్చా..
నేపియర్ : న్యూజిలాండ్, పాకిస్తాన్ల మధ్య మంగళవారం జరిగిన మూడో టీ20లో కివీస్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ డారెల్ మిచెల్ ఒంటిచేత్తో అందుకున్న క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. 6వ ఓవర్ వేసిన కుగ్గెలీజ్న్ బౌలింగ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ హైదర్ అలీ కవర్‌డ్రైవ్ మీదుగా షాట్ ఆడాడు. గ్యాప్‌లో వేచి ఉన్న మిచెల్ కొన్ని గజాలు వెనుకకు పరిగెత్తి అమాంతం గాల్లోకి ఎగిరి ఒకపక్కగా డైవ్‌చేస్తూ అందుకున్నాడు. వాస్తవానికి అంతకముందు ఓవర్లో హైదర్ అలీ కొట్టిన షాట్ మార్టిన్ గప్టిల్ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో వచ్చిన మిచెల్ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇంకో విశేషమేంటంటే.. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన డారెల్ మిచెల్ మూడు క్యాచ్‌లు అందుకోగా.. ఆ మూడు వికెట్లు కుగ్గెలీజ్న్ బౌలింగ్‌లోనే రావడం విశేషం. ఈ వీడియోనూ ఐసీసీ తన ట్విటర్లో షేర్ చేసింది. మిచెల్ అందుకున్నది 'క్యాచ్ ఆఫ్ ది సమ్మర్ అవునా.. కాదా మీరే చెప్పండి' అంటూ క్యాప్షన్ జత చేసింది. (చదవండి : ప్రేయసితో యువ క్రికెటర్ పెళ్లి) IS THAT THE CATCH OF THE SUMMER? Daryl Mitchell is on as sub-fielder for one ball and takes this special grab to remove Pakistan opener Haider Ali. Catch the run-chase live pic.twitter.com/fJqbirs0Hu — Spark Sport (@sparknzsport) December 22, 2020 ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ కివీస్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ సిరీస్‌ను 2–1తో దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 173 పరుగులు చేసింది. డేవన్ కాన్వే (45 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టులో.. తాత్కాలిక కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (59 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడూ హఫీజ్ (29 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కాగా రెండు జట్ల మధ్య ఈనెల 26 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. (చదవండి : ఒక్క ఓవర్.. ఐదు వికెట్లు.. సూపర్ కదా) -
‘ఆ క్రికెటర్‌తో పోలిక అసౌకర్యంగా ఉంది’
కరాచీ: టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ తనకు రోల్ మోడల్ అని గతంలో స్పష్టం చేసిన పాకిస్తాన్ యువ క్రికెటర్ హైదర్ అలీ.. అతనితో తనను పోల్చవద్దని అంటున్నాడు. రోహిత్ శర్మతో పోలికను తాను అంతగా ఆస్వాదించలేకపోతున్నానన్నాడు. అదే సమయంలో రోహిత్‌తో పోలిక తనకు అసౌకర్యంగా ఉందన్నాడు. ఎవరైనా తనను రోహిత్‌తో పోల్చినప్పుడు దానిని తీసుకోలేకపోతున్నానని హైదర్ అలీ తెలిపాడు. ‘చాలా మందికి పలువురు రోల్ మోడల్స్ ఉంటారు. నాకు రోహిత్ శర్మ రోల్ మోడల్. నేను ప్లేయర్‌గా రోహిత్‌ను ఇష్టపడతా. అతని దూకుడైన ఆట నాకు ఇష్టం. బంతిని రోహిత్ హిట్ చేసే విధానం చాలా ఇష్టం. అన్ని ఫార్మాట్లలో రోహిత్ ఆడుతున్నాడు. అన్ని ఫార్మాట్లకు సరిపోతాడు. అతనొక టాప్ బ్యాట్స్‌మన్. కానీ ఎవరైనా రోహిత్‌తో నన్ను పోల్చితే అసౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ నాకు అతనితో పోలిక లేదు. రోహిత్ ఇప్పటికే ఎన్నో సాధించాడు. నేను కూడా అన్ని ఫార్మాట్లలో ఆడగలను. నేను నా ఆటను ఎంజాయ్ చేస్తా. ఫస్ట్‌క్లాస్ సీజన్లో నేను కూడా మంచి క్రికెట్ ఆడాను. మా కోచ్ మహ్మద్ వసీం మార్గదర్శకాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మనకు కోచ్‌లు ఇచ్చే ఆత్మవిశ్వాసమే మన ఆటను వేరే స్థాయికి తీసుకెళ్తాయి. మన పూర్తిస్థాయి ప్రదర్శనకు కోచ్‌లే మార్గదర్శకులు’ అని హైదర్ అలీ పేర్కొన్నాడు. -
పాక్ క్రికెట్‌కు కరోనా సెగ
కరాచీ: మరో వారం రోజుల్లో ఇంగ్లండ్ పర్యటన కోసం బయలుదేరాల్సిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. ఈ సిరీస్ కోసం ఎంపికైన 29 మంది పాక్ క్రికెటర్లలో కొందరికి కోవిడ్–19 టెస్టులు నిర్వహించగా... జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సోమవారం ప్రకటించింది. యువ ఆటగాడు హైదర్ అలీతోపాటు షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్లకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో జట్టు వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఇంగ్లండ్ పర్యటన కోసమే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం రావల్పిండిలో వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ ముగ్గురికి వైరస్ సోకినట్లు తేలింది. వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన క్రికెటర్లను పీసీబీ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. అయితే పరీక్షల ముందు వరకు వీరికి ఎలాంటి లక్షణాలు లేకపోవడం గమనార్హం. ఈ ముగ్గురితో పాటు ఇమాద్ వసీమ్, ఉస్మాన్ షిన్వారీలనూ పరీక్షించగా వారి ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయని పీసీబీ వెల్లడించింది. మరోవైపు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, కోచ్ వకార్ యూనిస్‌లతోపాటు కొంతమంది జట్టు అధికారులు సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షలకు హాజరయ్యారు వీరి ఫలితాలు నేడు వచ్చే అవకాశముందని పీసీబీ తెలిపింది. ఇప్పటికే పాక్ మాజీ క్రికెటర్లు తౌఫిక్ ఉమర్, షాహిద్ అఫ్రిదిలు కరోనా బారిన పడ్డారు. -
రోహిత్ నా రోల్ మోడల్: పాక్ క్రికెటర్
కరాచీ: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై సహచర ఆటగాడు కేఎల్ రాహుల్ ఇటీవల ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. రోహిత్ బ్యాటింగ్‌కు తాను వీరాభిమానిని అని పేర్కొన్నాడు. అతడి లాంటి స్టార్ ఆటగాడు జట్టులో ఉంటే యువ ఆటగాళ్లకు ఎంతో ప్రేరణ కలుగుతుందన్నాడు.తాజాగా హిట్‌మ్యాన్ రోహిత్‌ను పాక్ యువ క్రికెటర్ హైదర్ అలీ సైతం కొనియాడాడు. రోహిత్ బ్యాటింగ్ అంటే తనకెంతో ఇష్టమని, ప్రత్యేకంగా అతని దూకుడుకు తాను వీరాభిమానని వ్యాఖ్యానించాడు. రోహిత్ బ్యాటింగ్ స్టైల్ తనలో ఎంతో ప్రేరణ తీసుకొచ్చిందని 19 ఏళ్ల హైదర్ విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నాడు. (సర్ఫరాజ్ ఈజ్ బ్యాక్) ‘అది టెస్టు మ్యాచ్ కావొచ్చు, వన్డే మ్యాచ్ కావొచ్చు లేదా టీ20 అయినా కావొచ్చు.. ఏదైనా రోహిత్ స్టైలే వేరు. బౌలర్లను ఎటాక్ చేసే తీరు అమోఘం. నేను కూడా పాకిస్తాన్ జట్టులో అదే తరహా ఆరంభాన్ని ఇవ్వాలని ఎప్పుడూ యత్నిస్తుంటా. అతను నాకు స్ఫూర్తి’ అని హైదర్ పేర్కొన్నాడు. త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లబోయే పాకిస్తాన్ జట్టులో హైదర్ అలీకి చోటు దక్కింది. 29 మందితో కూడిన పాక్ జట్టులో హైదర్ చోటు దక్కించుకున్నాడు. గత కొంతకాలంగా ఆకట్టుకుంటున్న హైదర్ అలీ.. ఈ ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన జూనియర్ వరల్డ్‌కప్‌లో భారత్‌తో సెమీ ఫైనల్లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే తనన భారత క్రికెట్ జట్టు కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లితో పోల్చడంపై కూడా హైదర్ అలీ కొన్ని నెలల క్రితం పెదవి విప్పాడు. తనను కోహ్లితో పోల్చవద్దంటూ విన్నవించాడు. కేవలం తమ దేశానికి చెందిన బాబర్ అజామ్‌తో పోల్చితేనే బాగుంటుందన్నాడు. బాబర్ అజామ్ మంచి షాట్లు ఆడతాడని, అతనిలా షాట్లు ఆడాలని అనుకుంటూ ఉంటానన్నాడు. ప్రాక్టీస్‌లో ఎక్కువగా బాబర్‌ను అనుకరిస్తానని అన్నాడు. అంతేకానీ కోహ్లిలా ఉండాలని అనుకోవడం లేదన్నాడు. తాను తనలాగే ఉండటమే ఇష్టమన్నాడు. ఎవరితోనూ పోలికను పెద్దగా ఇష్టపడనన్నాడు. పాక్ క్రికెట్‌కు హైదర్ అలీ రూపంలో కోహ్లి దొరికాడంటూ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ఈ ఏడాది మార్చిలో చేసిన వ్యాఖ్యలపై హైదర్ ఇలా స్పందించాడు.(రోహిత్ నా వెన్నంటి ఉన్నాడు: రాహుల్) -
సర్ఫరాజ్ ఈజ్ బ్యాక్
కరాచీ: గతేడాది జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో సత్తాచాటిన పాకిస్తాన్ యువ బ్యాట్స్‌మన్ హైదర్ అలీ అంతర్జాతీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఆగస్టులో ఇంగ్లండ్ గడ్డపై జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌కు సంబంధించి పాకిస్తాన్ జట్టులో హైదర్ అలీ చోటు దక్కించుకున్నాడు. ఇక నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టులో సొహైల్ ఖాన్‌కు అవకాశం దక్కింది. మరొకవైపు గతేడాది అక్టోబర్‌లో పాక్ తరఫున చివరిసారి కనిపించిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ రీఎంట్రీ ఖాయమైంది. ఇంగ్లండ్‌కు వెళ్లే 29 మందితో కూడిన పాక్ జట్టులో సర్ఫరాజ్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. (ఇక మా పని అయిపోయినట్లే: ఇషాంత్) ఇక పాకిస్తాన్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా మహ్మద్ రిజ్వాన్‌ను ఎంపిక చేశారు. అటు టెస్టు క్రికెట్‌కు ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకేసారి పీసీబీ సెలక్టర్లు జట్టును ప్రకటించారు.గత పీసీబీ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన పేసర్ వహాబ్ రియాజ్‌కు మరొకసారి అవకాశం ఇచ్చారు. కాగా, మహ్మద్ అమిర్, హారిస్ సొహైల్‌లు ఇంగ్లండ్ పర్యటనకు దూరం కానున్నారు. అమిర్ భార్య ఆగస్టులో ప్రసవించే అవకాశం ఉండటంతో అతను ఇంగ్లండ్ పర్యటన నుంచి వైదొలిగాడు. టెస్టు ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పి, కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్న అమిర్.. పీసీబీ అనుమతితో ఇంగ్లండ్ పర్యటన నుంచి వైదొలిగాడు.(‘సొహైల్.. నా రక్తం మరిగేలా చేశాడు’) -
కోహ్లి పేరుతో పిలవొద్దు: యువ క్రికెటర్
న్యూఢిల్లీ: తనను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పోల్చవద్దని పాకిస్తాన్ యువ బ్యాట్స్‌మన్ హైదర్ అలీ కోరాడు. అభిమానులు తనను పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ పేరుతో పిలవాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. అండర్-19 జట్టు ఓపెనర్ అయిన హైదర్ అలీ పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) తాజా సీజన్లో రాణించడంతో అతడిపై మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ప్రశంసలు కురిపించాడు. హైదర్ అలీలో కోహ్లి, బాబర్ అజామ్‌ల తరహా టాలెంట్ ఉందని.. ఏదొక రోజు అతడు ప్రపంచ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా ఎదుగుతాడని పొగిడాడు. (కోహ్లిని తలపించే మొనగాడు వచ్చాడు..!) ఈ నేపథ్యంలో హైదర్ అలీ స్పందిస్తూ... ‘తన రోల్ మోడల్స్‌లా అవ్వాలని ఏ బ్యాట్స్‌మన్ అనుకోడు. కానీ తనకు తానుగా మెరుగవుతూ వారిలా షాట్స్ ఆడేందుకు ప్రయత్నించాలి. నాను నేనుగా మెరుగవ్వాలని అనుకుంటున్నాను. కోహ్లి పేరుతో కాకుండా బాబర్ అజామ్ పేరుతో నన్ను పిలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాబర్ మంచి షాట్లు ఆడతాడు. విరాట్ కోహ్లిలా ఉండాలని అనుకోవడం లేదు. కానీ ప్రాక్టీస్ చేసి అతడిలా షాట్లు కొట్టేందుకు మాత్రం ప్రయత్నిస్తాను. నేను హైదర్ అలీని. నేను నాలాగే ఉండేందుకు ఇష్టపడతాను. ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ సందర్భంగా ఒకసారి బాబర్ అజామ్‌ను కలిశాను. బ్యాటింగ్ గురించి కొన్ని మెళకువలు నాకు చెప్పాడు. లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతడి నుంచి చాలా నేర్చుకున్నా. పీఎస్ఎల్లోనూ నన్ను అతడు ఎక్కువగా ప్రోత్సహించాడు. పరుగులు సాధించడంపైనే దృష్టి పెట్టు. మిగతా విషయాలు దేవుడికి వదిలేయాలని బాబర్ సూచించాడు’ అని వెల్లడించాడు. (దొంగ నిల్వలు పెట్టుకోవద్దు: అక్తర్)