కరాచీ: గతేడాది జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో సత్తాచాటిన పాకిస్తాన్ యువ బ్యాట్స్‌మన్ హైదర్ అలీ అంతర్జాతీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఆగస్టులో ఇంగ్లండ్ గడ్డపై జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌కు సంబంధించి పాకిస్తాన్ జట్టులో హైదర్ అలీ చోటు దక్కించుకున్నాడు. ఇక నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టులో సొహైల్ ఖాన్‌కు అవకాశం దక్కింది. మరొకవైపు గతేడాది అక్టోబర్‌లో పాక్ తరఫున చివరిసారి కనిపించిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ రీఎంట్రీ ఖాయమైంది. ఇంగ్లండ్‌కు వెళ్లే 29 మందితో కూడిన పాక్ జట్టులో సర్ఫరాజ్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. (ఇక మా పని అయిపోయినట్లే: ఇషాంత్)
ఇక పాకిస్తాన్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా మహ్మద్ రిజ్వాన్‌ను ఎంపిక చేశారు. అటు టెస్టు క్రికెట్‌కు ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకేసారి పీసీబీ సెలక్టర్లు జట్టును ప్రకటించారు.గత పీసీబీ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన పేసర్ వహాబ్ రియాజ్‌కు మరొకసారి అవకాశం ఇచ్చారు. కాగా, మహ్మద్ అమిర్, హారిస్ సొహైల్‌లు ఇంగ్లండ్ పర్యటనకు దూరం కానున్నారు. అమిర్ భార్య ఆగస్టులో ప్రసవించే అవకాశం ఉండటంతో అతను ఇంగ్లండ్ పర్యటన నుంచి వైదొలిగాడు. టెస్టు ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పి, కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్న అమిర్.. పీసీబీ అనుమతితో ఇంగ్లండ్ పర్యటన నుంచి వైదొలిగాడు.(‘సొహైల్.. నా రక్తం మరిగేలా చేశాడు’)
Comments
Please login to add a commentAdd a comment