పాకిస్తాన్‌ టి20 జట్టులో మూడు మార్పులు.. ఆ ముగ్గురికి చోటు | Fakhar Zaman-Sarfaraz Ahmed-Haider Ali Add Pakistan Revised Squad T20WC | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: పాకిస్తాన్‌ టి20 జట్టులో మూడు మార్పులు.. ఆ ముగ్గురికి చోటు

Published Fri, Oct 8 2021 7:40 PM | Last Updated on Fri, Oct 8 2021 8:07 PM

Fakhar Zaman-Sarfaraz Ahmed-Haider Ali Add Pakistan Revised Squad T20WC - Sakshi

3 Players Added In Pakistan T20 Worldcup Team.. టి20 ప్రపంచకప్‌ 2021 ప్రారంభానికి ముందు పాకిస్తాన్‌ తన జట్టులో మూడు మార్పులు చేసింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌  ఫఖర్‌ జమాన్‌, వికెట్‌ కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, మిడిలార్డర్‌ బ్యాటర్‌ హైదర్‌ అలీ జట్టులోకి వచ్చారు. కాగా ముందు ప్రకటించిన జట్టులో సర్ఫరాజ్‌తో హైదర్‌ అలీకి చోటు లేదు. అజమ్‌ ఖాన్‌, మహ్మద్‌ హస్‌నైన్‌ల స్థానంలో వీరిద్దరు చోటు దక్కించుకోగా.. ఇక ట్రావెల్‌ రిజర్వ్‌ ప్లేయర్‌గా ఉన్న ఫఖర్‌ జమాన్‌ను కుష్‌దిల్‌ షా స్థానంలో జట్టులోకి ఎంపిక చేశారు. తాజాగా జరిగిన నేషనల్‌ టి20 కప్‌లో ప్రదర్శన ఆధారంగా  ఈ ముగ్గురిని తుది జట్టులోకి తీసుకున్నట్లు చీఫ్‌ సెలెక్టర్‌ ముహముద్‌ వసీమ్‌ పేర్కొన్నారు. 

''ఈ ముగ్గురు నేషనల్‌ టి20 కప్‌లో ఆకట్టుకున్నారు. వాళ్ల అనుభవం ప్రస్తుతం జట్టుకు ఎంతో అవసరం. వీరు చేరడం వల్ల జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ఇక అజమ్‌ ఖాన్‌, కుష్‌దిల్‌ షా, హస్‌నైన్‌లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు జరగనున్న టి20 ప్రపంచకప్‌ టోర్నీలో పాకిస్తాన్‌ తన తొలి మ్యాచ్‌ను టీమిండియాతో అక్టోబర్‌ 24న ఆడనుంది.

టి20 ప్రపంచకప్‌ పాకిస్తాన్‌ 15మందితో కూడిన జట్టు
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, సోహైబ్ మక్సూద్

రిజర్వ్‌ ఆటగాళ్లు- కుష్‌దిల్‌ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement