వెస్టిండీస్ క్రికెట్ జట్టు 18 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో పర్యటిస్తోంది. చివరిసారిగా 2006లో పాకిస్తాన్‌లో టెస్టు మ్యాచ్ ఆడిన వెస్టిండీస్... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు సోమవారం ఇస్లామాబాద్‌లో అడుగు పెట్టింది. ఈ మధ్య కాలంలో కరీబియన్ జట్టు పాకిస్తాన్ గడ్డపై రెండుసార్లు పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడింది.
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 16 నుంచి కరాచీ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. 24 నుంచి జరగనున్న రెండో టెస్టుకు ముల్తాన్ ఆతిథ్యమిస్తుంది. అంతకుముందు 10 నుంచి విండీస్ జట్టు పాకిస్తాన్ షాహీన్స్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023–25లో ఇరు జట్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. విండీస్ జట్టుకు క్రెయిగ్ బ్రాత్‌వైట్ సారథ్యం వహిస్తుండగా... అమీర్ జాంగో తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. పాకిస్తాన్ ఇంకా తమ జట్టును ప్రకటించాల్సి ఉంది.
పాక్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ప్రోటీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0తో పాక్ వైట్‌వాష్‌కు గురైంది. ఒకట్రెండు రోజుల్లో పాక్ జట్టు స్వదేశంలో అడుగుపెట్టనుంది. అయితే ఈ సిరీస్‌కు పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ దూరమయ్యే అవకాశముంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో అయూబ్ కూడి కాలి పాదానికి గాయమైంది. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. అతడు శస్త్ర చికిత్స కోసం లండన్‌కు వెళ్లనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి ఫిట్‌నెస్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే విండీస్‌తో రెడ్ బాల్ సిరీస్‌కు అతడు దూరం కానున్నాడు.
వెస్టిండీస్ జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనాజ్, కీసీ కార్టీ, జోషువా డిసిల్వా, జస్టిన్ గ్రేవ్స్, కవెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, అమీర్ జంగూ, మికిల్ లూయిస్, గుడకేశ్ మోతీ, అండర్సన్ ఫిలిప్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, వారికన్.
చదవండి: ఆసీస్ గడ్డపై ఎంతో నేర్చుకున్నాను.. మళ్లీ బలంగా పైకి లేస్తాం: జైస్వాల్
Comments
Please login to add a commentAdd a comment