అవుట్‌ఫీల్డ్‌లో జారిపడ్డ పాక్ ఫీల్డర్ ( PC: cricket.com.au)
Australia vs Pakistan, 3rd Test- Day 3: అరంగేట్ర టెస్టుతోనే పాకిస్తాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ పేరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే, అద్భుత బ్యాటింగ్‌తో అతడు ట్రెండింగ్‌లోకి వచ్చాడనుకుంటే పొరపాటేనండోయ్! మరి హాట్‌టాపిక్‌లా మారడానికి అంత ‘గొప్ప’గా ఈ యంగ్ క్రికెటర్ ఏం చేశాడు?!
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2తో కోల్పోయిన పాకిస్తాన్ నామమాత్రపు ఆఖరి టెస్టులో సయీమ్ ఆయుబ్‌తో అరంగేట్రం చేయించింది. సిడ్నీ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో అతడు డకౌట్‌గా వెనుదిరిగి చేదు అనుభవం మూటగట్టుకున్నాడు.
అప్పుడు ఈజీ క్యాచ్ వదిలేశాడు
అదే విధంగా.. ఫీల్డింగ్ తప్పిదాలతోనూ మూల్యం చెల్లించుకున్నాడు. రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసి సొంతజట్టు అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.
ఇక మూడో రోజు ఆట సందర్భంగా మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం రాగా. కేవలం 33 పరుగులకే పరిమితమయ్యాడు 21 ఏళ్ల ఈ లెఫ్టాండర్ ఓపెనర్. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ఇంకా నయం.. గాయపడలేదు
ఈ పరిణామాల క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సయీమ్ ఆయుబ్.. తాజాగా మైదానంలో మరోసారి చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. సిడ్నీ అవుట్‌ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా ఫీల్డింగ్ చేసే క్రమంలో జర్రున జారి పడ్డాడు ఆయుబ్. అయితే, అదృష్టవశాత్తూ అతడికి ఎటువంటి గాయం కాలేదు. దీంతో పాక్ శిబిరం ఊపిరి పీల్చుకుంది.
క్యాప్‌తో బంతిని ఆపాడు? అయినా పెనాల్టీ లేదెందుకు?
శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో... నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. ఫీల్డింగ్ చేస్తున్నపుడు.. స్టీవ్ స్మిత్ బాదిన బంతిని ఆపే క్రమంలో జారిపడ్డ ఆయుబ్ క్యాప్ బాల్‌ను బౌండరీకి వెళ్లకుండా అడ్డుపడింది.
దీంతో నిబంధనల ప్రకారం.. బ్యాటింగ్ చేస్తున్న జట్టు అంటే ఆస్ట్రేలియాకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు రావాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే, ఈ విషయంపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ‘‘ఎవరైతే పెనాల్టీ పరుగుల గురించి అడుగుతున్నారో వారి కోసం ఈ జవాబు:
క్యాప్ కారణంగా బంతి బౌండరీ వెళ్లకుండా ఆగిపోయినప్పటికీ.. ఇది యాక్సిడెంటల్‌గా జరిగిన పరిణామం. ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అందుకే బ్యాటింగ్ జట్టుకు పెనాల్డీ పరుగులు రాలేదు’’ అని ప్రకటన విడుదల చేసింది. ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
చదవండి: T20 WC: అగార్కర్ ఒప్పించేశాడు.. కోహ్లి, రోహిత్ రీఎంట్రీ!?
For those asking: It's not a five-run penalty for hitting the cap as the contact between ball and hat was accidental, and nor was the cap deliberately left on the field, as helmets tend to be #AUSvPAK https://t.co/BFcgfoKnnT
— cricket.com.au (@cricketcomau) January 5, 2024
Comments
Please login to add a commentAdd a comment