నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరో సెంచరీ బాదేశాడు. గురువారం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ శతకం సాధించాడు. 110 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో వార్నర్ సెంచరీ నమోదు చేశాడు. ఇది వార్నర్‌కు 16వ వన్డే సెంచరీ కాగా, ఈ వరల్డ్‌కప్‌లో రెండో సెంచరీ.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ తీసుకోవడంతో ఇన్నింగ్స్‌ను అరోన్ ఫించ్, వార్నర్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడటంతో ఆసీస్‌కు శుభారంభం లభించింది. ఈ జోడి 121 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత ఫించ్(53; 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో రూబెల్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చిన ఫించ్ మొదటి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో వార్నర్‌కు ఉస్మాన్ ఖవాజా జత కలిశాడు. వీరు బంగ్లా బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ప్రధానంగా స్టైక్ రోటేట్ చేసి మరో మంచి భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ క్రమంలోనే వార్నర్ సెంచరీ సాధించాడు. దాంతో ఆసీస్ 35 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment