► భారత పేసర్లు దుమ్మురేపడంతో మొదటి టెస్టులో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్లు కోల్పోయింది. పేసర్లు బుమ్రా, షమీ, శార్దూల్ ఠాకూర్‌లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. ఇన్నింగ్స్ 59 ఓవర్ మొదటి బంతికి 64 పరుగులు చేసిన రూట్‌ను ఎల్బీగా వెనక్కి పంపిన శార్దూల్ ఆ తర్వాత నాలుగో బంతికి ఓలీ రాబిన్‌సన్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరుసటి ఓవర్లో బుమ్రా స్టువర్ట్ బ్రాడ్‌ను వెనక్కి పంపడంతో ఇంగ్లండ్ 160 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. ఇక 65.4 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది.
భారత బౌలర్ల విజృంభణ.. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
► భారత్ పేస్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. తాజాగా బుమ్రా బౌలింగ్‌లో జాస్ బట్లర్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 145 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 56 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 145 పరుగులె చేసింది. రూట్ 59, సామ్ కరన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్ జట్టు ఒకే ఓవర్లో రెండు వికెట్లను కోల్పోయింది. మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ 51వ ఓవర్ రెండో బంతికి జానీ బెయిర్ స్టో అవుట్ కాగానే ఇంగ్లండ్ టీ విరామానికి వెళ్లింది. విరామం అనంతరం షమీ వేసిన ఓవర్ చివరి బంతికి డానియెల్ లారెన్స్ డకౌట్‌గా వెనుదిరగడంతో 138 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కొల్పోయింది.
రూట్ హాఫ్ సెంచరీ.. నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్
► భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అర్థ సెంచరీతో మెరిశాడు. 89 బంతుల్లో అర్థ సెంచరీ మార్క్ అందుకున్న రూట్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉన్నాయి. రూట్ నిలకడైన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ కుదురుకుంటుంది. జానీ బెయిర్ స్టో 29 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ఇప్పటివరకు ఇద్దరి మధ్య 70 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ప్రస్తుతం 50 ఓవర్ల ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 137/3 గా ఉంది.
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
► ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. లంచ్ విరామం అనంతరం కాసేపటికే 18 పరుగులు చేసిన సిబ్లీ షమీ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 27, బెయిర్ స్టో 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
27 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరంతంటే..
► లంచ్ విరామం అనంతరం ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. 27 ఓవర్లు ముగిసేసమయానికి 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. డొమినిక్ సిబ్లీ 18, జో రూట్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌లు చెరో వికెట్ తీశారు.
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
► టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్ చివరి బంతికి 27 పరుగులు చేసిన క్రాలీ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 42 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అంతకముందు ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఐదో బంతికి బర్న్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 23 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.
► ఇంగ్లండ్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోవడంతో ఆచితూచి ఆడుతోంది. పది ఓవర్లు ముగిసిన తర్వాత ఇంగ్లండ్ జట్టు 24 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీసులో జాక్ క్రాలీ (16), సిబ్లీ (8) ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
► భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఐదో బంతికి బర్న్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ 2, సిబ్లీ 0 పరుగులతో ఆడుతున్నారు.
నాటింగ్‌హమ్: ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరిగే తొలి టెస్టులో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే మానసికంగా పైచేయి సాధించే అవకాశం ఉండటంతో ఇరు జట్లు శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇక టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక మొదటి టెస్టుకు ఇషాంత్ శర్మకు చోటు దక్కలేదు. ఇక గాయంతో మయాంక్ దూరం కావడంతోకేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చాడు. రోహిత్ తనదైన శైలిలో దూకుడుగా ఆడగలడు. అయితే 3, 4, 5 స్థానాల బ్యాట్స్‌మెన్‌లో నిలకడ లోపించడం భారత్‌ను కొంత బలహీనంగా మారుస్తోంది. కోహ్లి కూడా భారీ స్కోరు సాధించడంలో విఫలమవుతుండగా... పుజారా, రహానే చెప్పుకోదగ్గ స్కోరు సాధించి చాలా కాలమైంది. వీరు రాణిస్తేనే భారత బ్యాటింగ్ పటిష్టంగా మారుతుంది.
సామ్ కరన్ కీలకం...
ప్రతిష్టాత్మక సిరీస్‌కు బెన్ స్టోక్స్‌లాంటి స్టార్ ఆటగాడు దూరం కావడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ. అయితే యువ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ ఆ స్థానంలో తన వంతు పాత్ర పోషించనున్నాడు. అండర్సన్, బ్రాడ్‌లాంటి సీనియర్లతో పాటు రాబిన్సన్ మూడో పేసర్‌గా ఆడవచ్చు. ఇటీవల భారత పర్యటనకు వెళ్లి ఘోరమైన ప్రదర్శన కనబర్చిన బ్యాట్స్‌మెన్ బర్న్స్, సిబ్లీ, క్రాలీలకు సొంతగడ్డపైనైనా రాణించి ఆకట్టుకునేందుకు ఇది సరైన అవకాశం. ప్రధాన బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా తీవ్ర ఒత్తిడిలో ఉన్న రూట్‌కు కూడా ఈ సిరీస్ కీలకం కానుంది.
పిచ్, వాతావరణం
ఆరంభంలో సీమ్ బౌలింగ్‌కు అనుకూలిస్తూ ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగే సాధారణ ఇంగ్లండ్ తరహా పిచ్. కొంత పచ్చిక ఉన్నా, టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.
జట్ల వివరాలు:
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, జడేజా, శార్దుల్, షమీ, బుమ్రా
ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), బర్న్స్, సిబ్లీ, క్రాలీ, బెయిర్‌స్టో, బట్లర్, సామ్ కరన్, రాబిన్సన్, బ్రాడ్, డేనియల్ లారెన్స, అండర్సన్
Comments
Please login to add a commentAdd a comment