లండన్: ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ రేపటి నుంచి (శుక్రవారం,సెప్టెంబర్ 10న) జరగనుంది. ఈ విషయం పక్కనపెడితే.. నాలుగో టెస్టులో టీమిండియా విజయం అనంతరం ఆటగాళ్లు ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాకా డ్రెస్సింగ్ రూమ్‌కు బయలుదేరారు. చివరగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ వచ్చారు.
చదవండి: Kohli Winning Celebration: వినిపించడం లేదు.. ఇంకా గట్టిగా
పెవిలియన్ మార్గంలో ఒక వాటర్ బాటిల్ కింద పడి ఉంది. కోచ్‌తో కలిసి మాట్లాడుకుంటూ వస్తున్న రూట్ కిందపడి ఉన్న వాటర్ బాటిల్‌ను గమనించినప్పటికీ దానిని పట్టించుకోలేదు. మెట్లు ఎక్కి పైకి వచ్చేటప్పుడు అక్కడే ఉన్న కెమెరామన్ రూట్‌కు ఆ వాటర్ బాటిల్‌ను చూపించాడు. ఆ తర్వాత ఫ్రేమ్‌లోకి కోహ్లి వచ్చాడు. అయితే కోహ్లి మాత్రం కిందపడిన వాటర్ బాటిల్‌ను తనతో పాటు డ్రెస్సింగ్‌రూమ్‌కు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.
ఇది చూడడానికి చిన్నవిషయంలా కనిపించినా.. అభిమానులు మాత్రం తమదైన శైలిలో పోల్చారు. '' కోహ్లి ఎంత అగ్రెసివ్‌గా ఉన్న తన ప్రవర్తనతో అభిమానుల మనసులు ఎప్పటికీ గెలుచుకుంటూనే ఉంటాడు... రూట్‌ను ఇక్కడ కించపరచాలని కాదు.. కేవలం ఫన్నీవేలో మాత్రమే పేర్కొంటున్నాం.. కోహ్లికి ఎంత గొప్ప మనసు ఉందో మరోసారి చూశాం..'' అంటూ కామెంట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment