టీమిండియా, ఇంగ్లండ్‌ ఐదో టెస్టు వాయిదా | ENG Vs IND: Fifth Test Postponed After Corona Test Results Not Comeback | Sakshi
Sakshi News home page

ENG Vs IND 5th Test: టీమిండియా, ఇంగ్లండ్‌ ఐదో టెస్టు వాయిదా

Published Fri, Sep 10 2021 1:07 PM | Last Updated on Fri, Sep 10 2021 1:21 PM

ENG Vs IND: Fifth Test Postponed After Corona Test Results Not Comeback - Sakshi

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌, టీమిండియాల మధ్య జరగనున్న ఐదో టెస్టు మ్యాచ్‌ వాయిదా పడింది. ఈ మేరకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) శుక్రవారం ప్రకటించింది. మ్యాచ్‌కు ముందు గురువారం టీమిండియా పిజియోథెరపిస్ట్‌ యోగేశ్‌ పర్మార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అతనితో పాటు శిక్షణ సిబ్బందిలో మరికొందరు కరోనా బారిన పడడంతో మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఈసీబీ తెలిపింది. 

ఇప్ప‌టికే ఆట‌గాళ్ల‌తో పాటు జ‌ట్టు సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మొత్తం క‌రోనా ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వ‌చ్చాకే మ్యాచ్‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఈసీబీ  వెల్ల‌డించింది. అన్ని ఫలితాలు వచ్చే వరకు మ్యాచ్‌ను రెండు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఈసీబీ స్పష్టం చేసింది. కాగా నాలుగో టెస్టు జరగుతుండగానే టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రికి మొదట కరోనా పాజిటివ్‌గా తేలగా..  ఆ తర్వాత  బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కు కూడా కరోనా సోకింది. ఇ‍ప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. ఒకవేళ చివరి టెస్టు మ్యాచ్‌ రద్దు అయితే సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంటుంది.

చదవండి: Kohli And Ronaldo: మాంచెస్టర్‌లో కొత్త చరిత్ర.. రెండు పెద్ద తలలు ఇక్కడే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement