► టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడోరోజు ఆట ముగిసింది. వెలుతురులేమితో ఆటను ముందుగానే నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ప్రస్తుతం టీమిండియా మూడోరోజు ఆట ముగిసేసమయానికి 3 వికెట్లు నష్టానికి 270 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 22, రవీంద్ర జడేజా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఓవరాల్‌గా 171 పరుగుల ఆధిక్యంలో ఉంది.
వెనువెంటనే రెండు వికెట్లు
► టీ విరామం అనంతరం టీమిండియా ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఓలీ రాబిన్‌సన్ బౌలింగ్‌లో మొదట సెంచరీతో అదరగొట్టిన రోహిత్‌ను(127 పరుగులు) వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పుజారా, రోహిత్‌ల 153 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది. ఆ వెంటనే పుజారా(61) మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 81 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కోహ్లి (4), జడేజా(5) పరుగులతో క్రీజులో ఉన్నారు.
టీ విరామం.. టీమిండియా 199/1
►ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీ విరామం సమయానికి భారత్ వికెట్ నష్టానికి 199 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 103, పుజారా 48 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 100 పరుగుల ఆధిక్యంలో ఉంది.
రోహిత్ శర్మ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
► టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ నాలుగో టెస్టులో అద్భుత శతకంతో మెరిశాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన రోహిత్ టెస్టు కెరీర్‌లో 8వ సెంచరీని అందుకున్నాడు. 205 బంతులాడిన రోహిత్ 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. కాగా రోహిత్‌కు విదేశంలో ఇదే తొలి టెస్టు సెంచరీ. ఇంతకముందు వచ్చిన ఏడు సెంచరీలు స్వదేశంలో వచ్చినవే. ప్రస్తుతం టీమిండియా 65 ఓవర్లలో వికెట్ నష్టానికి 195 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 100, పుజారా 47 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.
రోహిత్ శర్మ ఫిప్టీ.. టీమిండియా 138/1
► టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో అర్థశతకంతో మెరిశాడు. 152 బంతులెదుర్కొన్న రోహిత్ ఆరు ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. రాహుల్ ఔటైన తర్వాత మరింత జాగ్రత్తగా ఆడిన రోహిత్ పుజారాతో ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 138 పరుగులు చేసింది. రోహిత్ 56, పుజారా 34 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా ఇప్పటివరకు 39 పరుగుల ఆధిక్యంలో ఉంది.
లంచ్ విరామం.. స్వల్ప ఆధిక్యంలో భారత్
► ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగోటెస్టులో టీమిండియా స్వల్ప ఆధిక్యంలోకి వచ్చింది. లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోయి 108 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 47, చతేశ్వర్ పుజారా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 9 పరుగుల ఆధిక్యంలో ఉంది.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
►ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. హాప్ సెంచరీకి చేరువగా వచ్చిన రాహుల్( 46 పరుగులు) అండర్సన్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే క్యాచ్‌పై సందేహంతో రాహుల్ రివ్యూ కోరాడు. అల్ట్రా ఎడ్జ్‌లో మాత్రం బంతి బ్యాట్‌ను తాకుతున్నట్లుగా స్పైక్ కనిపించడంతో రాహుల్‌కు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. రోహిత్ 36, పుజారా(0) పరుగులతో ఆడుతున్నాడు.
నిలకడగా ఆడుతున్న టీమిండియా
► టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతుంది. 43/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా ప్రస్తుతం 29 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 43, రోహిత్ శర్మ 35 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా ఇంకా 20 పరుగులు వెనుకబడి ఉంది.
లండన్: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆట మూడోరోజుకు చేరుకుంది. తొలి రోజు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆటలో కాస్త తడబడినప్పటికి చివరికి 99 పరుగులు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 20, రాహుల్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక మూడోరోజు ఆటలో ఇంగ్లండ్ బౌలర్లను నిలువరించి టీమిండియా ఎంతసేపు బ్యాటింగ్ చేస్తుందనే దానిపై ఫలితం ఆధారపడి ఉంది. అంతకముందు ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 290 పరుగుల వద్ద ఆలౌటైంది. ఒలీ పోప్ (81; 6 ఫోర్లు), క్రిస్ వోక్స్ (50; 11 ఫోర్లు) మెరిశారు.
Comments
Please login to add a commentAdd a comment