లీడ్స్: లార్డ్స్ టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతో అరుదైన విజయాన్ని అందుకున్న భారత జట్టు అంతలోనే అయ్యో అనిపించే ప్రదర్శన కనబర్చింది. ఇంగ్లండ్ పేసర్లు నిప్పులు చెరుగుతుండగా, ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కనీసం క్రీజులో నిలబడలేకపోయాడు. ఫలితంగా 78 పరుగులకే మన జట్టు ఆట ముగిసిపోయింది. ముఖ్యంగా గత మ్యాచ్ అనుభవం తాలూకు కసినంతా ప్రదర్శిస్తూ అండర్సన్ టీమిండియాను దెబ్బకొట్టాడు. ఈ నేపథ్యంలో మూడోటెస్టు తొలిరోజే టీమిండియా ఏడు చెత్త రికార్డులను నమోదు చేసింది. ఒకసారి వాటిని పరిశీలిద్దాం.
చదవండి: IND Vs ENG 3rd Test: కోహ్లి ఫిఫ్టి కొట్టాడు.. ఎలానో చూడండి..
► టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్‌మెన్‌లలో కనీసం ఒక్కరు కూడా 20 పరుగుల మార్క్‌ని చేరకపోవడం ఇదే తొలిసారి.
► లీడ్స్ టెస్టులో చివరి 5 వికెట్లని భారత్ జట్టు కేవలం 25 బంతుల్లోనే చేజార్చుకుంది. అంతకముందు 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 23 బంతుల్లో, 2013-14లో దక్షిణాఫ్రికాపై 25 బంతుల్లోనే చివరి 5 వికెట్లని టీమిండియా చేజార్చుకుంది.
► టెస్టులో ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారత్ నమోదు చేసిన మూడో అత్యల్ప స్కోరు ఇది (78). 1987-88లో వెస్టిండీస్‌పై 75, 2007-08లో దక్షిణాఫ్రికాపై 76 పరుగులకి ఆలౌటైంది.
► భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరుని ప్రత్యర్థి ఓపెనర్లే కొట్టేయడం ఇది నాలుగోసారి. 2011-12లో చివరిగా ఆస్ట్రేలియాపై భారత్ 161 పరుగులకి ఆలౌటవగా.. ఆ దేశ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఈడీ కోవాన్ తొలి వికెట్‌కి 214 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
► భారత్ జట్టు మొదటిరోజే ప్రత్యర్థికి ఆధిక్యం ఇవ్వడం ఇది నాలుగోసారి. 1987-88లో వెస్టిండీస్‌కి 43 పరుగులు, 1990లో న్యూజిలాండ్‌కి 36, 2007-08లో దక్షిణాఫ్రికాకి 147 పరుగులు.. తాజాగా ఇంగ్లాండ్‌కి 42 పరుగుల ఆధిక్యాన్ని భారత్ కట్టబెట్టింది.
► టెస్టు మ్యాచ్‌లో మొదటిరోజు వికెట్ నష్టపోకుండా ఒక జట్టు ఆధిక్యాన్ని అందుకోవడం ఇది మూడోసారి. 2000-01లో పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ 160/0 (పాక్ 104కి ఆలౌట్), 2010-11లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 157/0 ( ఆసీస్ 98 పరుగులకి ఆలౌట్)తో నిలవగా.. తాజాగా భారత్‌పై ఇంగ్లాండ్ 120/0 (భారత్ 78కి ఆలౌట్)తో నిలిచింది.
► ఇంగ్లండ్ గడ్డపై భారత్ నమోదు చేసిన మూడో అత్యల్ప స్కోరు 78. 1974లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో 42 పరుగులకే ఆలౌటైన భారత్.. 1952లో ఓల్డ్‌ట్రాఫోర్డ్‌లో జరిగిన టెస్టులో 58 పరుగులకి ఆలౌటైంది.
చదవండి: అరుదైన రికార్డును సమం చేసిన ఇంగ్లండ్ వికెట్‌కీపర్..
Comments
Please login to add a commentAdd a comment