Leeds
-
UK: లీడ్స్‌లో అల్లర్లు.. వాహనాలు ధ్వంసం
లండన్: బ్రిటన్ లీడ్స్ నగరంలోని హారేహిల్స్ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. అల్లర్లలో భాగంగా ఆందోళనకారులు ఒక డబుల్ డెక్కర్ బస్సుకు నిప్పు పెట్టారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు కారుపై దాడికి దిగి అద్దాలను ధ్వంసం చేశారు. కారును బోల్తా పడేశారు. భారీ సంఖ్యలో ఆందోళనకారులు అల్లర్లకు దిగడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. దీంతో అదనపు బలగాలను రప్పించారు. లక్సర్ వీధిలోని ఒక ఇంటి నుంచి నలుగురు పిల్లలను గురువారం(జులై 18) సోషల్ సర్వీసెస్ సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన కొందరు స్థానికులు ఒక్కసారిగా రోడ్లపై ఆందోళనకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి. ప్రజలు సంయమనం పాటించాలని వెస్ట్ యార్క్‌షైర్ ఎంపీ, హోం సెక్రటరీ కూపర్ ఎక్స్(ట్విటర్) వేదికగా కోరారు. వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. -
'వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది'
యాషెస్ సిరీస్‌లో మ్యాచ్‌లు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో.. మ్యాచ్ బయట జరిగే విషయాలు కూడా అంతే ఆసక్తిగా ఉంటున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో వివాదాస్పద ఔట్ తర్వాత ఇంగ్లీష్ మీడియా, అభిమానులు వీలు చిక్కినప్పుడల్లా ఆసీస్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీని విలన్‌గా ముద్రించారు. అతను కనిపించిన ప్రతీసారి ఏదో ఒకరీతిలో అతన్ని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టులో బ్యాటింగ్, కీపింగ్‌కు వచ్చిన సందర్భంలో మైదానంలోని ఇంగ్లండ్ అభిమానుల నుంచి అతనికి చీత్కారాలే ఎక్కువగా వచ్చాయి. దీనికి తోడు ఇంగ్లీష్ పత్రిక ది సన్ అలెక్స్ కేరీ కటింగ్షాపు ఓవర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడంటూ ఒక కథనాన్నే ప్రచురించింది. ''లీడ్స్‌లోని ఒక కటింగ్షాపుకు వెళ్లిన కేరీ హెయిర్ కట్ అనంతరం ఓనర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడు. దాంతో సదరు వ్యక్తి కేరీకి డెడ్‌లైన్ విధించాడంటూ'' రాసుకొచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తన థ్రెడ్స్ ఖాతాలో వివరణ ఇస్తూ సదరు పత్రికపై విమర్శలు గుప్పించాడు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదంటూ హితభోద చేశాడు. ''అలెక్స్ కేరీ లండన్ వచ్చినప్పటి నుంచి హెయిర్ కటింగ్ చేయించుకోలేదు. దానిని నేను కచ్చితంగా చెప్పగలను. ముందు నిజాలను తెలుసుకుంటే బాగుంటుంది'' అని స్మిత్ పోస్టు చేశాడు. ఇక యాషెస్ సిరీస్ మూడో టెస్టు రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. 251 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. డకెట్ (18 నాటౌట్), క్రాలీ (9 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఆ జట్టు మరో 224 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: #PrithviShaw: ''పుజారా సార్' నాలా బ్యాటింగ్ చేయలేడు.. నేను అంతే!' విలన్‌గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్షాపులో డబ్బులు ఎగ్గొట్టి -
విలన్‌గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్షాపులో డబ్బులు ఎగ్గొట్టి
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడోరోజు ఆటకు వరుణుడు అడ్డు పడ్డాడు. ఇప్పటికైతే ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 18, మిచెల్ మార్ష్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔట్ వివాదంతో ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ విలన్‌గా మారిపోయాడు. లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్ అభిమానులు అలెక్స్ కేరీని టార్గెట్ చేస్తూ గేలి చేశారు''ఆడింది చాలు.. పెవిలియన్ వెళ్లు.. అంటూ షూ, చెప్పులు చూపించడం'' వైరల్‌గా మారింది. ఇంగ్లీష్ మీడియాలో యాషెస్ విలన్‌గా ముద్ర పడిన అలెక్స్ కేరీ తన చర్యతో మరోసారి వార్తల్లో నిలిచాడు. లీడ్స్‌లోని ఒక కటింగ్షాపు ఓనర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడు. దాంతో సదరు వ్యక్తి కేరీకి డెడ్‌లైన్ విధించాడు. విషయంలోకి వెళితే.. ఆడం మహమూద్ అనే బార్బర్ వద్ద కేరీ కటింగ్ చేసుకున్నాడు.అందుకు 30 యూరోలు అంటే.. మన కరెన్సీలో రూ.2,718 అయింది. అయితే ఆసీస్ కీపర్ తన వద్ద అంత డబ్బు లేదని తప్పకుండా ఇచ్చేస్తానని ఆడంతో పేర్కొన్నాడు. కానీ ఇప్పటివరకు అతడికి పైసా కూడా ఇవ్వలేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మహమూద్.. క్యారీకి డెడ్‌లైన్ విధించాడు. ఈ సోమవారం(జూలై 10)లోగా డబ్బులు ముడితే తాను సంతోషిస్తానని లేదంటే తన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిపాడు. అయితే అలెక్స్ కేరీ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: IND Vs WI: అంతా కొత్త మొహాలే.. ఎవర్రా మీరంతా? -
ఆరు వికెట్లతో చెలరేగిన కమిన్స్.. ఇంగ్లండ్ 237 ఆలౌట్
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసకందాయంలో పడింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌట్ అయింది. స్టోక్స్ (108 బంతుల్లో 80 పరుగులు) ఒంటరిపోరాటం చేశాడు. పాట్ కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ భరతం పట్టాడు. ఇక ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించినట్లయింది. మూడు వికెట్ల నష్టానికి 68 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ కాసేపటికే రూట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు పడ్డప్పటికి ఒక ఎండ్‌లో స్టోక్స్ మాత్రం కుదురుగా ఆడాడు. 168 పరుగుల వద్ద మార్క్‌వుడ్(24 పరుగులు) ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరగ్గానే స్టోక్స్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. అప్పటికి ఇంగ్లండ్ ఇంకా 95 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో కుదురుకున్న స్టోక్స్ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 39 బంతుల్లో 61 పరుగులు చేయడం విశేషం. మర్ఫీ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన స్టోక్స్ ఆ తర్వాత కమిన్స్, స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్లతో చెలరేగాడు. తన దూకుడైన ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు స్వల్ప ఆధిక్యం దక్కేలా చేశాడు. స్టోక్స్ మినహా మిగతా బ్యాటర్లలో మొయిన్ అలీ 21, మార్క్ వుడ్ 24, జాక్ క్రాలీ 33 పరుగులు చేశారు. కమిన్స్ ఆరు వికెట్లు తీయగా.. స్టార్క్ రెండు, టాడ్ మర్ఫీ, మిచెల్ మార్ష్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ మార్ష్ సెంచరీతో రాణించాడు. చదవండి: #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం #Ashes2023: నిప్పులు చెరుగుతున్న కమిన్స్.. కష్టాల్లో ఇంగ్లండ్ -
నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. వన్డే తరహాలో రెచ్చిపోయి సెంచరీ
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్ష్ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన మార్ష్ కేవలం 102 బంతుల్లోనే శతకం సాధించడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన ఆసీస్.. మార్ష్ ఇన్నింగ్స్‌తో కోలుకున్నట్లగా కనిపిస్తోంది. మార్ష్‌కు.. ట్రెవిస్ హెడ్ (39 బ్యాటింగ్) అండగా నిలబడ్డాడు. చివరికి 118 బంతుల్లో 118 పరుగులు చేసిన మార్ష్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జాక్ క్రాలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సూపర్ ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఇక మిచెల్ మార్ష్ నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు. 2019 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో ఆఖరిసారిగా ఆడాడు. మళ్లీ తాజాగా యాషెస్తోనే ఎంట్రీ ఇచ్చిన మార్ష్ పునరగమనాన్ని ఘనంగా చాటాడు. కామెరున్ గ్రీన్ గాయపడడంతో మూడో టెస్టుకు జట్టులోకి వచ్చిన మార్ష్ ఏకంగా సెంచరీతో మెరిశాడు. మార్ష్ కెరీర్లో ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం విశేషం. Mitchell Marsh playing brutally against England 100 completed #Ashes#MitchellMarsh#Ashes2023 pic.twitter.com/UDAE7xadUY — Ansh Gaba (@cricketansh12) July 6, 2023 #MitchellMarsh #Bisonball🦬 pic.twitter.com/xNKEXpHqJa — Mr.Mirja (@Mr_Mirja01) July 6, 2023 What an outstanding 100, great counter -attack from Mitchell Marsh. #Ashes pic.twitter.com/8gcITRxdxV — Virender Sehwag (@virendersehwag) July 6, 2023 Sensational, Mitchell Marsh ✨#ENGvAUS | #Ashes pic.twitter.com/F4ATR2Gknr — ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2023 చదవండి: #MarkWood: యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్ #SteveSmith: వందో టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు -
టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బజ్‌బాల్‌ను పక్కనబెడుతుందా?
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మొదలైంది. లీడ్స్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి రెండు టెస్టులు ఓడి 0-2తో వెనుకబడిన ఇంగ్లండ్ మూడో టెస్టులో గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం మూడో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను గెలవాలని చూస్తోంది. యాషెస్ సిరీస్‌కు ముందు బజ్‌బాల్ ఆటతో ఆసీస్‌కు కళ్లెం వేస్తామని పేర్కొన్న స్టోక్స్ సేన ఆటకు వచ్చేసరికి పూర్తిగా చతికిలపడింది. బజ్‌బాల్ దూకుడు కొనసాగించాలన్న తపనతో చేతులు కాల్చుకున్న ఇంగ్లండ్ కనీసం మూడో టెస్టులోనైనా దానిని పక్కనబెడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు జరగ్గా.. ఇంగ్లండ్ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. కామెరాన్ గ్రీన్ స్థానంలో మిచెల్ మార్ష్ తుదిజట్టులోకి రాగా.. గాయపడ్డ నాథన్ లియోన్ స్థానంలో టాడ్ మర్ఫీ వచ్చాడు. ఇక ఇంగ్లండ్ జట్టులో అండర్సన్ స్థానంలో మార్క్ వుడ్‌ను తీసుకోగా.. గాయపడ్డ ఓలీపోప్ స్థానంలో మోయిన్ అలీ.. జోష్ టంగ్ స్థానంలో క్రిస్ వోక్స్ తుదిజట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్ ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్ BREAKING: England choose to bowl after winning the toss ✅ pic.twitter.com/BbHIFZFM2S — Sky Sports Cricket (@SkyCricket) July 6, 2023 చదవండి: #ManchesterUnited: ఇంగ్లండ్ స్టార్‌కు కళ్లు చెదిరే మొత్తం.. అవి డబ్బులా ఇంకేమైనా! IND vs WI: అతడిని ఎందుకు సెలక్ట్ చేశారు.. ఏం చేశాడని! పాపం రుత్‌రాజ్ -
Ashes 2023: అండర్సన్‌పై వేటు.. బ్రూక్‌కు ప్రమోషన్
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో పరాజయాలు చవిచూసిన ఇంగ్లండ్ కాస్త డీలా పడినట్లు కనిపిస్తోంది. ఎలాగైనా మూడో టెస్టులో గెలవాలన్న పట్టుదలతో ఉంది. లీడ్స్ వేదికగా మూడో టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) బుధవారం తుది జట్టును ప్రకటించింది. అంతా ఊహించినట్లుగానే తొలి రెండు టెస్టుల్లో వికెట్లు తీయడంలో విఫలమైన సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌పై వేటు పడింది. 41 ఏళ్ల అండర్సన్ టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 179 టెస్టుల్లో 688 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌తో మూడో టెస్టుకు అతన్ని పక్కనబెట్టారు. అండర్సన్‌తో పాటు రెండో టెస్టులో ఐదు వికెట్లతో రాణించిన జోష్ టంగ్‌ను కూడా పక్కనబెట్టడం ఆశ్చర్యం కలిగించింది. వీరిద్దరి స్థానాల్లో ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌తో పాటు మార్క్ వుడ్లు తుది జట్టులోకి వచ్చారు. ఇక భుజం గాయంతో సిరీస్‌కు దూరమైన బ్యాటర్ ఓలీ పోప్ స్థానంలో ఆల్‌రౌండర్ మొయిన్ అలీ జట్టులోకి వచ్చాడు. ఇక హ్యారీ బ్రూక్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ వచ్చింది. లార్డ్స్ టెస్టులో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హ్యారీ బ్రూక్.. మూడో టెస్టులో మాత్రం ఓలీ పోప్ స్థానమయిన నెంబర్-3లో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఈ మ్యాచ్‌లో గనుక ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మాత్రం ఇంగ్లండ్ గడ్డపై 22 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్‌ను గెలిచిన కెప్టెన్‌గా పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించనున్నాడు. మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్ చదవండి: దిగ్గజంతో చేతులు కలిపిన రోహిత్, విరాట్.. #Neymar: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా -
రవాణా ‘వసతుల’ కల్పనలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: సులభతర సరుకు రవాణా వ్యవస్థలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వరంగ డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్)–2022 ర్యాంకుల్లో రాష్ట్రం మరోసారి సత్తాను చాటింది. లీడ్స్–2022 ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల విభాగాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు అచీవర్స్‌గా నిలిచాయి. ఫాస్ట్ మూవర్స్ విభాగంలో కేరళ ఉండగా, ఏస్పైర్స్ విభాగంలో గోవా, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. తీరప్రాంతం లేని రాష్ట్రాలు, తీరప్రాంతం ఉన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల కింద నాలుగు విభాగాలుగా విభజించి అచీవర్స్, ఫాస్ట్‌మూవర్స్, ఏస్పైర్స్ ర్యాంకులను ప్రకటించారు. సర్వేలో 90 శాతానికిపైగా పాయింట్లు సాధించిన రాష్ట్రాలను అచీవర్స్‌గా, 80 నుంచి 90 శాతం మధ్య ఉన్న వాటిని ఫాస్ట్మూవర్స్గా, 80 శాతం కంటే తక్కువ పాయింట్లు పొందిన రాష్ట్రాలను ఏస్పైర్స్గా ప్రకటించారు. తీరప్రాంతం లేని రాష్ట్రాల విభాగాల్లో హరియాణ, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలున్నాయి. దేశవ్యాప్తంగా సరుకు రవాణా సేవలను వినియోగిస్తున్న వారి అభిప్రాయాలను తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించారు. 2030 నాటికి దేశ ఎగుమతులు రెండు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంలో మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా 2018 నుంచి లీడ్స్ ర్యాంకులను ప్రకటించడం మొదలుపెట్టింది. 2021 లీడ్స్ ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మొదటిస్థానంలో నిలిచింది. సింగిల్ డెస్క్‌తో సత్ఫలితాలు లీడ్స్–2022లో అత్యధిక పాయింట్లతో మొదటిస్థానం రావడంలో స్పందన కీలకపాత్ర పోషించినట్లు నివేదికలో పేర్కొన్నారు. పరిశ్రమల సమస్యలను పరిష్కరించడానికి ఇండస్ట్రీస్ స్పందన పేరుతో ఏర్పాటు చేసిన సింగిల్ డెస్క్ పోర్టల్ సత్ఫలితాలను ఇస్తోంది. రవాణా మౌలికవసతుల్లో గోడౌన్లు మినహాయించి మిగిలిన అన్నీ సగటుకంటే ఎక్కువ మార్కులు పొందినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సులభతర సరుకు రవాణా కోసం పోర్టులు, పారిశ్రామికపార్కుల వద్ద ట్రక్ పార్కింగ్ టెర్మినల్స్‌ను అభివృద్ధి చేస్తోంది. నెల్లూరు, గంగవరం, అనంతపురం, తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లుగా పేర్కొంది. -
బోరిస్‌కు ఎందుకు వెన్నుపోటు పొడిచారు? రిషికి ఇబ్బందికర ప్రశ్నలు
లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్, లిజ్ ట్రస్ తొలిసారి కన్జర్వేటివ్ పార్టీ సభ్యులతో నేరుగా సమావేశమయ్యారు. ఎప్పటిలాగే ఆర్థికవ్యవస్థ, జీవన వ్యయం వంటి అంశాలపైనే ఇద్దరు తమ విధానాల గురించి వివరించారు. నార్త్ యార్క్‌షైర్ లీడ్స్‌లో వేదికగా జరిగిన ఈ కర్యక్రమంలో టోరీ సభ్యుల నుంచి రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు ఎదురయ్యాయి. వారంతా ప్రధాని బోరిస్ జాన్సన్ పట్ల తమ విధేయతను చాటుకుంటూ రిషిని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు సంధించారు. దానికి ఆయన కూడా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. 'మీరు మంచి సేల్స్‌మన్, బలమైన వ్యక్తి. కష్ట సమయంలో స్థిరంగా పాలన సాగించిన బోరిస్‌కు అందరూ మద్దతుగా నిలిచారు. కానీ మీరు మాత్రం వెన్నుపోటు పొడిచారని చాలా మంది అనుకుంటున్నారు. మిమ్మల్ని సీనియర్ పొలిటీషియన్‌ను చేసింది బోరిసే' అని ఓ టోరీ సభ్యుడు రిషి సునాక్‌ను ప్రశ్నించారు. అయితే రిషి ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. గత్యంతరం లేకే తాను ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వివరించారు. కరోనా కష్ట సమయంలో ఆర్థిక విధానాలపై ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినందుకే అలా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. అలాగే తాను అధికారంలోకి వస్తే పన్ను రాయితీ ఇస్తానని ప్రకటించిన లిజ్ ట్రస్ ఆర్థిక విధానాలపైనా రిషి విమర్శలు గుప్పించారు. తాత్కాలిక ఉపశమనం కోసం పన్నుల్లో కోత విధించి తర్వాతి తరాల పిల్లల భవిష్యత్తును తాకట్టుపెట్టలేనని స్పష్టం చేశారు. చదవండి: లైవ్ ప్రోగ్రామ్‌లో కుప్పకూలిన యాంకర్.. సాయం చేసిన రిషి సునాక్ -
సెంచరీతో చెలరేగిన బెయిర్‌స్టో.. ఇంగ్లండ్ స్కోర్: 264/6
లీడ్స్: న్యూజిలాండ్‌తో మూడో టెస్టు... తొలి ఇన్నింగ్స్‌లో ఒకదశలో ఇంగ్లండ్ 55/6... ఇక ఆలౌట్ కావడమే ఖాయం అనుకుంటున్న తరుణంలో బెయిర్‌స్టో అద్భుతం చేశాడు. గత టెస్టులో 77 బంతుల్లో మెరుపు శతకంతో చెలరేగిన అతను ఈసారి క్లిష్ట పరిస్థితుల్లో అదే తరహాలో ఎదురుదాడితో చెలరేగి జట్టును ఆదుకున్నాడు. కివీస్ బౌలర్లపై చెలరేగి 95 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. బెయిర్‌స్టో (126 బంతుల్లో 130 బ్యాటింగ్; 21 ఫోర్లు)కు తోడు అరంగేట్ర టెస్టు ఆడుతున్న జేమీ ఓవర్టన్ (106 బంతుల్లో 89 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్లకు 264 పరుగులు చేసింది. బెయిర్‌స్టో, ఓవర్టన్ ఏడో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 209 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ మరో 65 పరుగులే వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 225/5తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (109; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సిరీస్‌లో వరుసగా మూడో టెస్టులోనూ సెంచరీ చేయడం విశేషం. చదవండి: Ranji Trophy2022 Final: రంజీ ఫైనల్.. దుమ్మురేపిన యష్ దూబే, శుభమ్ శర్మ -
ENG Vs IND: ఇన్నింగ్స్ ఓటముల్లో టీమిండియా చెత్త రికార్డు
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘోర పరాభవం మూటగట్టుకుంది. గత రెండు టెస్టులకు ఏమాత్రం సరిపోని ప్రదర్శనతో టీమిండియా బోల్తా పడింది. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌ను 1–1తో సమం చేసింది.సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో నాలుగో టెస్టు జరుగుతుంది. కాగా ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలయిన టీమిండియా పలు చెత్త రికార్డులు నమోదు చేసింది. అవేంటనేవి ఒకసారి పరిశీలిస్తే.. చదవండి: అంపైర్‌ను భయపెట్టిన పుజారా.. తృటిలో తప్పించుకున్నాడు ► టీమిండియా టెస్టుల్లో ఇన్నింగ్స్ ఓటమి పొందడం ఇది 45వ సారి. ఇక ఇంగ్లండ్ 63 ఇన్నింగ్స్ ఓటములతో తొలి స్థానంలో ఉండగా.. వెస్డిండీస్ (46), ఆస్ట్రేలియా(44), బంగ్లాదేశ్(43), న్యూజిలాండ్(39) ఉన్నాయి. ► విరాట్ కోహ్లి సారధ్యంలో టీమిండియా టాస్ గెలిచిన టెస్టులో ఇన్నింగ్స్ ఓటమి పొందడం ఇది రెండోసారి. ఇంతకముందు ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో ఇన్నింగ్స్ తేడాతోనే పరాజయం పాలైంది. అంతేగాక కోహ్లికి కెప్టెన్‌గా ఇంగ్లండ్‌పై ఇది రెండో ఇన్నింగ్స్ ఓటమి. అంతకముందు 2018 లార్డ్స్ టెస్టులోనూ ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ► ఇకటీమిండియా ఒక టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో అత్యల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో భారత్ మరో చెత్త రికార్డును నమోదు చేసింది. లీడ్స్ టెస్టులో 63 పరుగుల వ్యవధిలో భారత్ మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. ఇక 2016-17లో ఆసీస్‌పై 41 పరుగుల వ్యవధిలో.. 1952లో మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌పై 64 పరుగుల వ్యవధిలో.. 2020-21లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై 77 పరుగుల వ్యవధిలో వికెట్లు కోల్పోయి పరాజయాలు చవిచూసింది. ► ఇంగ్లండ్ కెప్టెన్‌గా జోరూట్‌కు టెస్టుల్లో ఇది 27వ విజయం.ఈ విజయంతో రూట్( 27 విజయాలు, 55 టెస్టులు) అత్యధిక విజయాలు సాధించిన ఇంగ్లండ్ కెప్టెన్లలో తొలిస్థానంలో నిలిచాడు. మైకెల్ వాన్(51 టెస్టుల్లో 26 విజయాలు) రెండో స్థానం, ఆండ్రూ స్ట్రాస్ (50 టెస్టుల్లో 24 విజయాలు), అలిస్టర్ కుక్( 59 టెస్టుల్లో 24 విజయాలు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. -
ENG Vs IND: తొలిరోజే టీమిండియా చెత్త రికార్డులు
లీడ్స్: లార్డ్స్ టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతో అరుదైన విజయాన్ని అందుకున్న భారత జట్టు అంతలోనే అయ్యో అనిపించే ప్రదర్శన కనబర్చింది. ఇంగ్లండ్ పేసర్లు నిప్పులు చెరుగుతుండగా, ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కనీసం క్రీజులో నిలబడలేకపోయాడు. ఫలితంగా 78 పరుగులకే మన జట్టు ఆట ముగిసిపోయింది. ముఖ్యంగా గత మ్యాచ్ అనుభవం తాలూకు కసినంతా ప్రదర్శిస్తూ అండర్సన్ టీమిండియాను దెబ్బకొట్టాడు. ఈ నేపథ్యంలో మూడోటెస్టు తొలిరోజే టీమిండియా ఏడు చెత్త రికార్డులను నమోదు చేసింది. ఒకసారి వాటిని పరిశీలిద్దాం. చదవండి: IND Vs ENG 3rd Test: కోహ్లి ఫిఫ్టి కొట్టాడు.. ఎలానో చూడండి.. ► టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్మెన్లలో కనీసం ఒక్కరు కూడా 20 పరుగుల మార్క్‌ని చేరకపోవడం ఇదే తొలిసారి. ► లీడ్స్ టెస్టులో చివరి 5 వికెట్లని భారత్ జట్టు కేవలం 25 బంతుల్లోనే చేజార్చుకుంది. అంతకముందు 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 23 బంతుల్లో, 2013-14లో దక్షిణాఫ్రికాపై 25 బంతుల్లోనే చివరి 5 వికెట్లని టీమిండియా చేజార్చుకుంది. ► టెస్టులో ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారత్ నమోదు చేసిన మూడో అత్యల్ప స్కోరు ఇది (78). 1987-88లో వెస్టిండీస్‌పై 75, 2007-08లో దక్షిణాఫ్రికాపై 76 పరుగులకి ఆలౌటైంది. ► భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరుని ప్రత్యర్థి ఓపెనర్లే కొట్టేయడం ఇది నాలుగోసారి. 2011-12లో చివరిగా ఆస్ట్రేలియాపై భారత్ 161 పరుగులకి ఆలౌటవగా.. ఆ దేశ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఈడీ కోవాన్ తొలి వికెట్‌కి 214 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ► భారత్ జట్టు మొదటిరోజే ప్రత్యర్థికి ఆధిక్యం ఇవ్వడం ఇది నాలుగోసారి. 1987-88లో వెస్టిండీస్‌కి 43 పరుగులు, 1990లో న్యూజిలాండ్‌కి 36, 2007-08లో దక్షిణాఫ్రికాకి 147 పరుగులు.. తాజాగా ఇంగ్లాండ్‌కి 42 పరుగుల ఆధిక్యాన్ని భారత్ కట్టబెట్టింది. ► టెస్టు మ్యాచ్‌లో మొదటిరోజు వికెట్ నష్టపోకుండా ఒక జట్టు ఆధిక్యాన్ని అందుకోవడం ఇది మూడోసారి. 2000-01లో పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ 160/0 (పాక్ 104కి ఆలౌట్), 2010-11లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 157/0 ( ఆసీస్ 98 పరుగులకి ఆలౌట్)తో నిలవగా.. తాజాగా భారత్‌పై ఇంగ్లాండ్ 120/0 (భారత్ 78కి ఆలౌట్)తో నిలిచింది. ► ఇంగ్లండ్ గడ్డపై భారత్ నమోదు చేసిన మూడో అత్యల్ప స్కోరు 78. 1974లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో 42 పరుగులకే ఆలౌటైన భారత్.. 1952లో ఓల్డ్‌ట్రాఫోర్డ్‌లో జరిగిన టెస్టులో 58 పరుగులకి ఆలౌటైంది. చదవండి: అరుదైన రికార్డును సమం చేసిన ఇంగ్లండ్ వికెట్‌కీపర్.. -
వెయ్యి పరుగులు పూర్తి చేసిన కోహ్లి
లీడ్స్ : టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. ప్రపంచకప్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఐదు పరుగుల వద్ద ఉండగా ఈ ఘనతను అందుకున్నాడు. 25 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన మూడో భారత ఆటగాడిగా విరాట్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికే ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (44 ఇన్నింగ్స్‌ల్లో 2278 )పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, సౌరవ్ గంగూలీ( 21 ఇన్నింగ్స్‌ల్లో 1006) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ టీమిండియా తరపున అత్యంత వేగంగా వెయ్యి పరుగుల రికార్డు సాధించేందుకు 23పరుగుల దూరంలో నిలిచాడు.ఇప్పటివరకు హిట్‌మ్యాన్ రోహిత్ 16 ఇన్నింగ్స్‌ల్లో 977 పరుగులు నమోదు చేశాడు. జూలై 9న జరగనున్న మొదటి సెమీఫైనల్లో టీమిండియా న్యూజీలాండ్‌తో తలపడనుంది. -
షమీ, చహల్‌కు విశ్రాంతి
లీడ్స్: వన్డే వరల్డ్‌కప్‌లో ఇప్పటికే టాప్-4లో చోటు దక్కించుకున్న భారత జట్టు ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. శనివారం స్థానిక హెడింగ్లే మైదానంలో శ్రీలంకతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు పాయింట్ల పట్టికలో మేలు చేస్తుంది. 13 పాయింట్లతో ఉన్న భారత జట్టు 15 పాయింట్లకు చేరుతుంది. అటు ఆస్ట్రేలియా (14) తమ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఓడితే కోహ్లి సేన టాప్కు చేరుతుంది. ఇదే జరిగితే సెమీస్‌లో మన జట్టుకు న్యూజిలాండ్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మిడిల్ సత్తా చాటితేనే... రోహిత్, రాహుల్, కోహ్లిలతో కూడిన భారత టాపార్డర్ జట్టుకు మంచి ఆరంభాలు అందించడంలో ముందుంటోంది. కానీ ఆ తర్వాతే అసలు సమస్య ప్రారంభమవుతోంది. వారందించే స్కోరును భారీగా మలిచేందుకు మిడిలార్డర్లో ప్రయత్న లోపం కనిపిస్తోంది. అనూహ్యంగా నెంబర్ 4లో బ్యాటింగ్‌కు దిగుతోన్న రిషభ్ పంత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించాడు. కానీ సుదీర్ఘంగా క్రీజులో నిలవలేకపోతున్నాడు. డెత్ ఓవర్లలో భారత్ నుంచి వేగంగా పరుగులు రాకపోవడం ఆందోళనకరం. శ్రీలంక మ్యాచ్ ద్వారా మిడిల్ ఆర్డర్ సమస్య తీరుతుందని భారత్ యోచిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మహ్మద్ షమీ, చహల్‌కు విశ్రాంతి ఇచ్చి వారి స్థానాల్లో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లకు చోటు కల్పించింది. ఈ వరల్డ్‌కప్‌లో జడేజా ఆడబోయే తొలి మ్యాచ్ ఇది. మరొకవైపుసెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన శ్రీలంక గత మ్యాచ్‌లో విండీస్‌ను ఓడించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన యువ అవిష్క ఫెర్నాండో అదే జోరు సాగించాలని జట్టు ఆశిస్తోంది. లంక ఓపెనర్లలో కరుణరత్నే ఒక మ్యాచ్ మినహా బాగానే ఆడగా, కుశాల్ పెరీరా కూడా మూడు అర్ధ సెంచరీలతో మెరుగైన ప్రదర్శన చేశాడు. భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకు 158 మ్యాచ్‌లు జరిగాయి. 90 మ్యాచ్‌ల్లో భారత్... 56 మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలిచాయి. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. 11 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్‌లు జరిగాయి. 3 మ్యాచ్‌ల్లో భారత్... 4 మ్యాచ్‌ల్లో శ్రీలంక నెగ్గాయి. మరో మ్యాచ్ రద్దయింది. -
దీటుగా బదులిస్తున్న అఫ్గాన్
లీడ్స్: వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్ జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ దీటుగా బదులిస్తోంది. వెస్టిండీస్ నిర్దేశించిన 312 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్ నిలకడగా ఆడుతోంది. 21 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. రహ్మత్ షా, ఇక్రమ్ అలీ ఖిల్లు హాఫ్ సెంచరీలు సాధించారు. భారీ లక్ష్య ఛేదనలో అఫ్గాన్ ఆదిలోనే కెప్టెన్ గుల్బదీన్ నైబ్(5) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రహ్మత్ షాకు జత కలిసిన వికెట్ కీపర్ ఇక్రమ్ అలీ ఖిల్లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశారు. విండీస్ పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ అర్థ శతకాలతో మెరిశారు. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. విండీస్ ఆటగాళ్లలో ఎవిన్ లూయిస్(58; 78 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), షాయ్ హోప్(77; 92 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మెయిర్(39; 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్(58; 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్), హోల్డర్(45; 34 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. -
అఫ్గాన్ లక్ష్యం 312
లీడ్స్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ 312 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. విండీస్ ఆటగాళ్లలో ఎవిన్ లూయిస్(58; 78 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), షాయ్ హోప్(77; 92 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మెయిర్(39; 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్(58; 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్), హోల్డర్(45; 34 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ క్రిస్ గేల్(7) నిరాశపరచడంతో విండీస్ 21 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో లూయిస్-హోప్‌ల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఈ జోడి రెండో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత లూయిస్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై హెట్మెయిర్తో కలిసి 65 పరుగులు జత చేశాడు హోప్. దాంతో విండీస్ గాడిలో పడింది. చివర్లో పూరన్, హోల్డర్లు ధాటిగా బ్యాటింగ్ చేయడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రాత్‌వైట్ నాలుగు బంతులు ఆడి ఒక సిక్స్, రెండు ఫోర్లతో 14 పరుగులు చేశాడు. అఫ్గాన్ బౌలర్లలో దవ్లాత్ జద్రాన్ రెండు వికెట్లు సాధించగా, నబీ, రషీద్ ఖాన్, షిర్జాద్లకు తలో వికెట్ దక్కింది. -
నామమాత్రపు పోరు.. గెలుపెవరిదో?
లీడ్స్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జేసన్ హెల్డర్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ మెగా టోర్నీ నుంచి ఇరు జట్లు ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఇది నామమాత్రపు మ్యాచ్ కానుంది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఒక మ్యాచ్ మాత్రమే గెలవగా, ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఇక అఫ్గానిస్తాన్ అస్సలు బోణీనే కొట్టలేదు. ఎనిమిది మ్యాచ్‌లకు గాను ఎనిమిదింట పరాజయం చవిచూసింది. దాంతో తమ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని యోచిస్తోంది. ఇదిలా ఉంచితే, ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరులో ఐదు వన్డేలు జరగ్గా మూడింట అఫ్గానిస్తాన్ విజయం సాధించగా, ఒక దాంట్లో వెస్టిండీస్ గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌పై ఉన్న ఘనమైన రికార్డును కొనసాగించాలనే అఫ్గాన్ భావిస్తోంది. అదే సమయంలో విండీస్ కూడా గెలుపుపై ధీమాగా ఉంది. తుది జట్లు వెస్టిండీస్ జేసన్ హెల్డర్(కెప్టెన్), క్రిస్‌గేల్, ఎవిన్ లూయిస్, షాయ్ హోప్, హిమ్రాన్ హెట్మెయిర్, నికోలస్ పూరన్, కార్లోస్ బ్రాత్‌వైట్, ఫాబియన్ అలెన్, షెల్డాన్ కాట్రెల్, ఓష్నీ థామస్, కీమర్ రోచ్ అఫ్గానిస్తాన్ గుల్బదిన్ నైబ్(కెప్టెన్), రహ్మత్ షా, అస్గర్ అఫ్గన్, మహ్మద్ నబీ, సమిల్లాహ్ షిన్వారి, నజిబుల్లా జద్రాన్, ఇక్రమ్ అలీ ఖిల్, రషీద్ ఖాన్, దవ్లాత్ జద్రాన్, సయ్యద్ షిర్జాద్, ముజీబ్ ఉర్ రహ్మన్ -
బెయిర్ స్టో గోల్డెన్ డక్
లీడ్స్: వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ బెయిర్ స్టో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. శ్రీలంక నిర్దేశించిన 233 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను బెయిర్ స్టో, జేమ్స్ విన్సేలు ఆరంభించారు. అయితే లంక సీనియర్ పేసర్ లసిత్ మలింగా వేసిన తొలి ఓవర్ రెండో బంతికి బెయిర్ స్టో ఎల్బీగా ఔటయ్యాడు. దీనిపై స్టో రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురు కావడంతో అతను భారంగా పెవిలియన్ వీడాడు. దాంతో పరుగు వద్దే ఇంగ్లండ్ తొలి వికెట్‌ను నష్టపోయింది. వరల్డ్‌కప్‌లో రెండుసార్లు గోల్డెన్ డక్‌గా ఔటైన నాల్గో ఇంగ్లండ్ ఆటగాడిగా బెయిర్ స్టో నిలిచాడుఈ వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బెయిర్ స్టో గోల్డెన్ డక్‌గా ఔటైన సంగతి తెలిసిందే. అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. శ్రీలంక ఆటగాళ్లలో ఏంజెలో మాథ్యూస్(85 నాటౌట్)కు జతగా అవిష్కా ఫెర్నాండో(49), కుశాల్ మెండిస్(46)లు మాత్రమే మెరవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ తలో మూడు వికెట్లు సాధించగా, ఆదిల్ రషీద్‌కు రెండు వికెట్లు లభించాయి. క్రిస్ వోక్స్ వికెట్ తీశాడు. -
మాథ్యూస్ మెరిసినా..
లీడ్స్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 233 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శ్రీలంక ఆటగాళ్లలో ఏంజెలో మాథ్యూస్(85 నాటౌట్)కు జతగా అవిష్కా ఫెర్నాండో(49), కుశాల్ మెండిస్(46)లు మాత్రమే మెరవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. లంక ఓపెనర్లు దిముత్ కరుణరత్నే((1), కుశాల్ పెరీరా(2) తీవ్రంగా నిరాశపరచడంతో ఆ జట్టు మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ఆవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్ జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 59 పరుగులు జత చేసిన తర్వాత ఫెర్నాండో(49; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో కుశాల్ మెండిస్-ఏంజెలా మాథ్యూస్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశారు. కాగా, కుశాల్ మెండిస్(46; 68 బంతుల్లో 2 ఫోర్లు) నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరగా, జీవన్ మెండిస్ ఇలా వచ్చి అలా నిష్క్రమించాడు. ధనంజయ డిసిల్వా(29) ఫర్వాలేదనిపించగా, మాథ్యూస్ మాత్రమే కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ తలో మూడు వికెట్లు సాధించగా, ఆదిల్ రషీద్‌కు రెండు వికెట్లు లభించాయి. క్రిస్ వోక్స్ వికెట్ తీశాడు. -
ఇంగ్లండ్‌తో మ్యాచ్: కష్టాల్లో శ్రీలంక
లీడ్స్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులు 133 పరుగులకే ఐదు వికెట్ల కోల్పోయి ఎదురీదుతున్నారు. లంక ఓపెనర్లు దిముత్ కరుణరత్నే((1), కుశాల్ పెరీరా(2) తీవ్రంగా నిరాశపరచడంతో ఆ జట్టు మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ఆవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్ జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 59 పరుగులు జత చేసిన తర్వాత ఫెర్నాండో(49; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో కుశాల్ మెండిస్-ఏంజెలా మాథ్యూస్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశారు. కాగా, కుశాల్ మెండిస్(46; 68 బంతుల్లో 2 ఫోర్లు) నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరగా, జీవన్ మెండిస్ ఇలా వచ్చి అలా నిష్క్రమించాడు. ఆదిల్ రషీద్ వేసిన బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. -
ఇంగ్లండ్‌కు ఎదురుందా?
లీడ్స్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగనున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఫామ్‌ను చూస్తే ఆ జట్టును ఓడించడం శ్రీలంకకు కష్టమే. లంకేయులు సమిష్టగా రాణిస్తే తప్ప ఇంగ్లండ్‌ను నిలువరించడం అంత ఈజీ కాదు. ఇప్పటికే ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించింది. ఒకవైపు భారీ స్కోరు సాధిస్తునే ప్రత్యర్థి జట్లను కట్టడి చేసే తీరు అద్భుతంగా ఉంది. దాంతో తాజా మ్యాచ్‌లో ఇంగ్లండ్‌నే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మెగా టోర్నీలో లంక జట్టు మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి.. రెండింటిలో ఓడింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో లంక 4 పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది. సెమీస్ చేరాలంటే లంకేయులు తమ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌పై నెగ్గి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని కరుణరత్నే సేన పట్టుదలగా ఉంది. అయితే బ్యాటింగ్ వైఫల్యం లంకను వేధిస్తోంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనైనా బ్యాటింగ్‌లో మెరుగుపడి భారీ స్కోరు సాధించాలనే పట్టుదలతో ఉంది. కాగా, ఇరు జట్లు ఇప్పటివరకు 74 మ్యాచ్‌ల్లో తలపడగా లంక 35 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇంగ్లండ్ 36 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా, రెండింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో 10 మ్యాచ్‌లకుగాను నాలుగింట్లో లంక, ఆరు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. తుది జట్లు శ్రీలంక దిముత్ కరుణరత్నే(కెప్టెన్), కుశాల్ పెరీరా, అవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, తిషారా పెరీరా, జీవన్ మెండిస్, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉదాన, లసిత్ మలింగా, నువాన్ ప్రదీప్ ఇంగ్లండ్ ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జేమ్స్ విన్సే, జోనీ బెయిర్ స్టో, జో రూట్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్ -
ఇంగ్లండ్ విజయలక్ష్యం 455
లీడ్స్: న్యూజిలాండ్ నిర్దేశించిన 455 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు వర్షం అడ్డుపడింది. దీంతో సోమవారం నాలుగో రోజు ఆటలో 13 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు లిత్ (29 బంతుల్లో 24 బ్యాటింగ్; 4 ఫోర్లు), కుక్ (49 బంతుల్లో 18 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నారు. నేడు (మంగళవారం) ఆటకు చివరి రోజు. అంతకుముందు 338/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 454 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వాట్లింగ్ (163 బంతుల్లో 120; 15 ఫోర్లు, 1 సిక్స్), క్రెయిగ్ (77 బంతుల్లో 58 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), సౌతీ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వుడ్‌కు మూడు, అండర్సన్, బ్రాడ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.