యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసకందాయంలో పడింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌట్ అయింది. స్టోక్స్ (108 బంతుల్లో 80 పరుగులు) ఒంటరిపోరాటం చేశాడు. పాట్ కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ భరతం పట్టాడు. ఇక ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించినట్లయింది.
మూడు వికెట్ల నష్టానికి 68 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ కాసేపటికే రూట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు పడ్డప్పటికి ఒక ఎండ్‌లో స్టోక్స్ మాత్రం కుదురుగా ఆడాడు. 168 పరుగుల వద్ద మార్క్‌వుడ్(24 పరుగులు) ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరగ్గానే స్టోక్స్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. అప్పటికి ఇంగ్లండ్ ఇంకా 95 పరుగులు వెనుకబడి ఉంది.
క్రీజులో కుదురుకున్న స్టోక్స్ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 39 బంతుల్లో 61 పరుగులు చేయడం విశేషం. మర్ఫీ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన స్టోక్స్ ఆ తర్వాత కమిన్స్, స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్లతో చెలరేగాడు. తన దూకుడైన ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు స్వల్ప ఆధిక్యం దక్కేలా చేశాడు. స్టోక్స్ మినహా మిగతా బ్యాటర్లలో మొయిన్ అలీ 21, మార్క్ వుడ్ 24, జాక్ క్రాలీ 33 పరుగులు చేశారు. కమిన్స్ ఆరు వికెట్లు తీయగా.. స్టార్క్ రెండు, టాడ్ మర్ఫీ, మిచెల్ మార్ష్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ మార్ష్ సెంచరీతో రాణించాడు.
చదవండి: #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం
#Ashes2023: నిప్పులు చెరుగుతున్న కమిన్స్.. కష్టాల్లో ఇంగ్లండ్
Comments
Please login to add a commentAdd a comment