యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ఓవల్ వేదికగా ఐదో టెస్టు గురువారం ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగింది. కామెరాన్ గ్రీన్ ఈ టెస్టుకు దూరం కావడంతో అతని స్థానంలో స్పిన్నర్ టాడ్ మర్ఫీ తుదిజట్టులోకి వచ్చాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. బెన్ డకెట్ 29, జాక్ క్రాలీ 10 పరుగులతో ఆడుతున్నారు.
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, టాడ్ మర్ఫీ
ఇంగ్లండ్ గెలిచినా ఆసీస్‌దే యాషెస్..
ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లో 2-1తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది. ఒకవేళ చివరి టెస్టులో ఇంగ్లండ్ గెలిచి 2-2తో సిరీస్ సమం అయినా యాషెస్ ట్రోఫీ మాత్రం ఆస్ట్రేలియా వద్దనే ఉంటుంది. చివరగా 2021లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 4-1తో ఇంగ్లండ్‌పై నెగ్గింది. రూల్ ప్రకారం యాషెస్ సిరీస్ ఎప్పుడు జరిగినా సిరీస్ డ్రాగా ముగిస్తే గత ఎడిషన్‌లో ట్రోఫీ సాధించిన జట్టు వద్దే యాషెస్ ఉంటుంది.
ఈ లెక్కన ఆస్ట్రేలియా చివరి టెస్టులో ఓడినా, డ్రా అయినా యాషెస్ మాత్రం వారి వద్దే ఉంటుంది. ఇక ఇంగ్లండ్ చివరిసారి 2015లో యాషెస్ దక్కించుకుంది. స్టోక్స్ సారధ్యంలో బజ్‌బాల్ ఆటతీరుతో దూకుడుగా కనిపిస్తున్న ఇంగ్లండ్ ఈసారి కచ్చితంగా యాషెస్ గెలుస్తుందని అంతా భావించారు.
కానీ డిఫెండింగ్ ఛాంపియన్ ఆటతీరు ప్రదర్శించిన ఆస్ట్రేలియా తొలి రెండు టెస్టుల్లో నెగ్గి ఇంగ్లండ్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో టెస్టులో ఓడినప్పటికి.. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ దూకుడు చూపించినా.. వరుణుడి ఆటంకం, లబుషేన్ అద్భుత సెంచరీతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
చదవండి: Kylian Mbappe: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె!
World cup 2023: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్.. 10 సెకన్లకు 30 లక్షలు!
Comments
Please login to add a commentAdd a comment