UK: లీడ్స్‌లో అల్లర్లు.. వాహనాలు ధ్వంసం | Riots In Britain Leeds City Chaos Prevails | Sakshi
Sakshi News home page

UK: లీడ్స్‌లో అల్లర్లు.. పోలీసు వాహనంపై దాడి

Published Fri, Jul 19 2024 1:22 PM | Last Updated on Fri, Jul 19 2024 3:12 PM

Riots In Britain Leeds City Chaos Prevails

లండన్‌: బ్రిటన్‌ లీడ్స్‌ నగరంలోని హారేహిల్స్‌ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. అల్లర్లలో భాగంగా ఆందోళనకారులు ఒక డబుల్‌ డెక్కర్‌ బస్సుకు నిప్పు పెట్టారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు కారుపై దాడికి దిగి అద్దాలను ధ్వంసం చేశారు. 

కారును బోల్తా పడేశారు. భారీ సంఖ్యలో  ఆందోళనకారులు అల్లర్లకు దిగడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. దీంతో అదనపు బలగాలను రప్పించారు. లక్సర్‌ వీధిలోని ఒక ఇంటి నుంచి నలుగురు పిల్లలను గురువారం(జులై 18) ‌సోషల్‌ సర్వీసెస్‌ సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు. 

ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన కొందరు స్థానికులు ఒక్కసారిగా రోడ్లపై ఆందోళనకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి. ప్రజలు సంయమనం పాటించాలని వెస్ట్‌ యార్క్‌షైర్‌ ఎంపీ, హోం సెక్రటరీ కూపర్‌  ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా కోరారు. వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement