యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్ష్ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన మార్ష్ కేవలం 102 బంతుల్లోనే శతకం సాధించడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన ఆసీస్.. మార్ష్ ఇన్నింగ్స్‌తో కోలుకున్నట్లగా కనిపిస్తోంది.
మార్ష్‌కు.. ట్రెవిస్ హెడ్ (39 బ్యాటింగ్) అండగా నిలబడ్డాడు. చివరికి 118 బంతుల్లో 118 పరుగులు చేసిన మార్ష్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జాక్ క్రాలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సూపర్ ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఇక మిచెల్ మార్ష్ నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు.
2019 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో ఆఖరిసారిగా ఆడాడు. మళ్లీ తాజాగా యాషెస్‌తోనే ఎంట్రీ ఇచ్చిన మార్ష్ పునరగమనాన్ని ఘనంగా చాటాడు. కామెరున్ గ్రీన్ గాయపడడంతో మూడో టెస్టుకు జట్టులోకి వచ్చిన మార్ష్ ఏకంగా సెంచరీతో మెరిశాడు. మార్ష్ కెరీర్‌లో ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం విశేషం.
Mitchell Marsh playing brutally against England 100 completed #Ashes#MitchellMarsh#Ashes2023 pic.twitter.com/UDAE7xadUY
— Ansh Gaba (@cricketansh12) July 6, 2023
#MitchellMarsh #Bisonball🦬 pic.twitter.com/xNKEXpHqJa
— Mr.Mirja (@Mr_Mirja01) July 6, 2023
What an outstanding 100, great counter -attack from Mitchell Marsh. #Ashes pic.twitter.com/8gcITRxdxV
— Virender Sehwag (@virendersehwag) July 6, 2023
Sensational, Mitchell Marsh ✨#ENGvAUS | #Ashes pic.twitter.com/F4ATR2Gknr
— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2023
చదవండి: #MarkWood: యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్
Comments
Please login to add a commentAdd a comment