లీడ్స్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జేసన్ హెల్డర్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ మెగా టోర్నీ నుంచి ఇరు జట్లు ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఇది నామమాత్రపు మ్యాచ్ కానుంది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఒక మ్యాచ్ మాత్రమే గెలవగా, ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఇక అఫ్గానిస్తాన్ అస్సలు బోణీనే కొట్టలేదు. ఎనిమిది మ్యాచ్‌లకు గాను ఎనిమిదింట పరాజయం చవిచూసింది. దాంతో తమ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని యోచిస్తోంది.
ఇదిలా ఉంచితే, ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరులో ఐదు వన్డేలు జరగ్గా మూడింట అఫ్గానిస్తాన్ విజయం సాధించగా, ఒక దాంట్లో వెస్టిండీస్ గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌పై ఉన్న ఘనమైన రికార్డును కొనసాగించాలనే అఫ్గాన్ భావిస్తోంది. అదే సమయంలో విండీస్ కూడా గెలుపుపై ధీమాగా ఉంది.
తుది జట్లు
వెస్టిండీస్
జేసన్ హెల్డర్(కెప్టెన్), క్రిస్‌గేల్, ఎవిన్ లూయిస్, షాయ్ హోప్, హిమ్రాన్ హెట్‌మెయిర్, నికోలస్ పూరన్, కార్లోస్ బ్రాత్‌వైట్, ఫాబియన్ అలెన్, షెల్డాన్ కాట్రెల్, ఓష్నీ థామస్, కీమర్ రోచ్
అఫ్గానిస్తాన్
గుల్బదిన్ నైబ్(కెప్టెన్), రహ్మత్ షా, అస్గర్ అఫ్గన్, మహ్మద్ నబీ, సమిల్లాహ్ షిన్వారి, నజిబుల్లా జద్రాన్, ఇక్రమ్ అలీ ఖిల్, రషీద్ ఖాన్, దవ్లాత్ జద్రాన్, సయ్యద్ షిర్‌జాద్, ముజీబ్ ఉర్ రహ్మన్
Comments
Please login to add a commentAdd a comment