రెండో రోజు ముగిసిన ఆట..56 పరుగుల వెనుకంజలో భారత్..
► ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్సింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యాన్నిభారత్ ముందుంచింది. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతుంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్సింగ్స్‌లో వికెట్ నష్టపడకుండా భారత్ 43/0 స్కోర్‌ను నమోదుచేసింది. ఓపెనర్లు రాహుల్ 22 పరుగులు, రోహిత్ శర్మ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది.
ఇంగ్లండ్ ఆలౌట్.. 99 పరుగుల ఆధిక్యం
► టీమిండియాతో జరుగతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 99 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆఖర్లో క్రిస్ వోక్స్ (60 బంతుల్లో 50 పరుగులు, 11 ఫోర్లు) వన్డే తరహాలో ఆడాడు. అర్థశతకం సాధించిన వెంటనే రనౌట్‌గా వెనుదిరగడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో ఓలీ పోప్ 81, వోక్స్ 50, బెయిర్ స్టో 37 పరుగులు చేశారు. టీమిండియా బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్ 3,జడేజా, బుమ్రాలు చెరో రెండు వికెట్లు తీశారు.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
► టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో 5 పరుగులు చేసిన రాబిన్‌సన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 65 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు ఓలీ పోప్ రూపంలో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సెంచరీకి చేరువవుతున్న ఓలీ పోప్ 81 పరుగులు వద్ద శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.
టీ విరామం.. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
► టీ విరామం సమయానికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. టీ విరామానికి ముందు 35 పరుగులు చేసిన మొయిన్ అలీ జడేజా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 36 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఓలీ పోప్ 74, క్రిస్ వోక్స్(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆధిక్యంలోకి వచ్చిన ఇంగ్లండ్..
► ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి వచ్చింది. 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను బెయిర్ స్టో, ఓలీ పోప్‌లు చక్కదిద్దారు. అయితే 37 పరుగులు చేసిన బెయిర్ స్టొ ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ 26 పరుగులతో సహకారం అందించడంతో పోప్ అర్థసెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. పోప్ 69, అలీ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..
► టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో 37 పరుగులు చేసిన బెయిర్ స్టో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే ఎల్బీపై ఇంగ్లండ్ రివ్యూ వెళ్లినప్పటికి నిరాశే మిగిలింది. సిరాజ్ వేసిన బంతి ఆఫ్‌స్టంప్ అవతల నుంచి వెళ్లినప్పటికి వికెట్లను తాకడంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓలీ పోప్ 51 పరుగులు, మొయిన్ అలీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లంచ్ విరామం.. ఇంగ్లండ్ 139/5
► టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కుదురుకుంటుంది. 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో ఓలీ పోప్, జానీ బెయిర్ స్టోలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు 109 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ 42 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఓలీ పోప్38, బెయిర్ స్టో 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ టీమిండియా కంటే ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది.
► టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన డేవిడ్ మలాన్ 31 పరుగుల స్కోరు వద్ద ఉమేశ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్త్తుతం ఇంగ్లండ్ 25 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఓలీ పోప్ 4, జానీ బెయిర్ స్టో (0) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 వికెట్ల నష్టానికి 53 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన క్రెయిగ్ ఓవర్టన్(1) ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
లండన్: ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు సీమర్లకు అడ్డాగా తయారైంది. ప్రతి సెషన్‌లోనూ పేసర్లదే పైచేయి. బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో పాతుకోకుండా వణికిస్తోంది. మొదట ఇంగ్లండ్ పేసర్ల ముందు మన బ్యాట్స్‌మెన్ తలవంచారు. కోహ్లి అర్ధసెంచరీ భారత్‌కు ఊరటనిస్తే... ఆఖరి సెషన్లో శార్దుల్ ఠాకూర్ మెరుపులు భారత్ స్కోరులో జోరును పెంచాయి. ఇదే సెషన్లో భారత సీమర్లు దీటుగా సత్తాచాటారు. కీలకమైన 3 వికెట్లను పడగొట్టి తొలి రోజే టెస్టును రసవత్తరంగా మార్చారు. మరో 8 బంతుల్లో రోజు ముగుస్తుందనగా అద్భుత బంతితో రూట్‌ను బౌల్డ్ చేసిన ఉమేశ్ ఘనంగా ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment