Watch: Virat Kohli Tries To Balance His Bat Like Joe Root But Fails, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Virat Kohli Viral Video: రూట్‌ మ్యాజిక్‌ ట్రిక్‌ను అనుకరించబోయి బొక్కబోర్లా!

Published Fri, Jun 24 2022 4:26 PM | Last Updated on Fri, Jun 24 2022 5:14 PM

Virat Kohli Tries To Make Bat-Stand Like Joe Root But Fails Video Viral - Sakshi

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ప్రస్తుతం జట్టుతో కలిసి ఇంగ్లండ్‌ పర్యటనలో​బిజీగా ఉన్నాడు. జూలై 1న ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు నేపథ్యంలో భారత్‌ తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే టీమ్‌ సభ్యులంతా రెండుగా విడిపోయి లీస్టర్‌షైర్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతున్నారు. కాగా గురువారం మ్యాచ్‌లో టీమిండియా తరపున బరిలోకి దిగిన కోహ్లి 69 బంతుల్లో 33 పరుగులు చేశాడు.

కాగా కోహ్లి చేసిన ఒక చర్య ఆసక్తికరంగా మారి కెమెరా కంటికి చిక్కింది. ఇటీవలే ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్నప్పుడు కాసేపు తన బ్యాట్‌ను ఏ సపోర్టు లేకుండా నిటారుగా నిలబెట్టాడు. రూట్‌ మ్యాజిక్‌ ట్రిక్‌ను చూసిన ఫ్యాన్స్‌ ఇది ఎలా సాధ్యం అని తల పట్టుకున్నారు.తాజాగా ప్రాక్టీస్‌లో భాగంగా కోహ్లి.. రూట్‌ మ్యాజిక్‌ ట్రిక్‌ను అనుకరించబోయి బొక్కబోర్లా పడ్డాడు.

నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో నిల్చున్న కోహ్లి రూట్‌ లాగే తన బ్యాట్‌ను నిటారుగా నిలబెట్టాలని ప్రయత్నించాడు. కానీ పదేపదే బ్యాట్‌ జారిపోవడం జరిగింది. దీంతో కోహ్లి రూట్‌ మ్యాజిక్‌ ట్రిక్‌ను అందుకోవడంలో ఫెయిల్‌ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. గురువారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (111 బంతుల్లో 70 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అదరగొట్టాడు.

చదవండి: IND vs LEI: రాణించిన శ్రీకర్‌ భరత్‌.. టీమిండియా స్కోర్‌: 246/8

చిన్న వయసులోనే వింత రోగం.. ఫుట్‌బాల్ ఆడొద్దన్నారు; కట్‌చేస్తే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement