![Virat Kohli Advice Mohammed Siraj Bowler Dismisses Joe Root Next-Ball - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/17/Kohli%5D.jpg.webp?itok=zBcMa3Pv)
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మూడో వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోహ్లి కెప్టెన్సీలో చాలా మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ అతని డైరెక్షన్‌లో చాలాసార్లు వికెట్లు సాధించాడు. తాజాగా మరోసారి కోహ్లి ఇచ్చిన సలహాతో సిరాజ్ మరోసారి వికెట్ అందుకున్నాడు. ఆరంభంలోనే షమీ బౌలింగ్‌లో జేసన్ రాయ్ వరుస బౌండరీలు బాది టీమిండియాకు హెచ్చరికలు పంపాడు.
అయితే మరుసటి ఓవర్లో సిరాజ్ ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. ఓపెనర్ జానీ బెయిర్ స్టోను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత రూట్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని ముద్దాడిన రూట్ మూల్యం చెల్లించుకున్నాడు. స్లిప్‌లో ఉన్న రోహిత్ సులువుగా క్యాచ్ అందుకున్నాడు. అయితే రూట్ ఔట్‌కు ముందు సిరాజ్ వద్దకు పరిగెత్తుకొచ్చిన కోహ్లి మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో ఆఫ్‌స్టంప్ అవతల బంతిని విసురు కచ్చితంగా ఫలితం ఉంటుంది అని చెప్పాడు. కోహ్లి ఇచ్చిన డైరెక్షన్‌ను తూచా తప్పకుండా పాటించిన సిరాజ్ ఫలితం సాధించాడు.
దీంతో వికెట్ పడగానే కోహ్లి వైపు చూస్తూ.. ''చూశావా నీ వ్యూహం ఫలించింది'' అన్నట్లుగా సైగలు చేయడం.. ఆ తర్వాత కోహ్లి పరిగెత్తుకొచ్చి సిరాజ్‌ను హగ్ చేసుకోవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది చూసిన అభిమానులు మాత్రం ఫన్నీ కామెంట్స్ చేశారు.'' రోహిత్‌ను కాదని కోహ్లి డైరెక్షన్‌లో సిరాజ్ బౌలింగ్''..'' కెప్టెనేమో రోహిత్.. సలహా ఇచ్చింది కోహ్లి.. పాటించింది సిరాజ్.. ఇదేదో బాగుంది'' అంటూ కామెంట్స్ చేశారు.
. https://t.co/AfzhNBDJrL pic.twitter.com/lEwjKscSWl
— Arav Mishra (@The_hitwicket18) July 17, 2022
చదవండి: Liam Livingstone: అక్కడుంది లివింగ్‌స్టోన్.. 'కన్‌స్ట్రక్షన్ సైట్‌లోకి బంతి'
'రోజులో 90 ఓవర్లు వేయకపోతే కెప్టెన్‌ను సస్పెండ్ చేయాల్సిందే'
Comments
Please login to add a commentAdd a comment