నాటింగ్‌హమ్: హండ్రెడ్ బాల్ క్రికెట్ కాంపీటీషన్‌లో భాగంగా ట్రెంట్ రాకెట్స్‌కు ఆడుతున్న ఆఫ్ఘన్ స్టార్ రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్గాడు. ముందు బౌలింగ్‌లో మూడు వికెట్లతో దుమ్మురేపిన అతను ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ 25 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే రషీద్ ఔటయ్యే సమయానికి ట్రెంట్ ఇంకా 47 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఓపెనర్‌గా వచ్చిన అలెక్స్ హేల్స్ 40 పరుగులతో చివరివరకు నాటౌట్‌గా నిలిచి అద్భుత విజయాన్ని అందించాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తన్ సూపర్‌చార్జర్స్ 99 బంతుల్లో 132 పరుగులకు ఆలౌట్ అయింది. నార్తన్ బ్యాటింగ్‌లో జె. సింప్సన్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హ్యారీ బ్రూక్ 38 పరుగులు చేశాడు. ట్రెంట్ రాకెట్స్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ 3,డీ లాంజ్ 3, మాథ్యూ కార్టర్ 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆడిన ట్రెంట్ రాకెట్స్ 94 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అలెక్స్ హేల్స్ 40, రషీద్ ఖాన్ 25 పరుగులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment