నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ 35 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు నష్టానికి 218 పరుగులు చేసింది. పాక్ ఆటగాళ్లలో ఇమాముల్ హక్(44:58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఫకార్ జమాన్(36:40 బంతుల్లో 6 ఫోర్లు), బాబర్ అజామ్(63:66 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, హఫీజ్ సైతం హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాక్ కోల్పోయిన తొలి మూడు వికెట్లు మొయిన్ అలీ ఖాతాలో పడ్డాయి.
తొలుత ఫకార్ జమాన్‌ను ఔట్ చేసిన అలీ.. ఆపై ఇమాముల్ హక్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. దాంతో పాకిస్తాన్ 111 పరుగుల వద్ద ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అటు తర్వాత 33 ఓవర్‌లో కుదురుగా ఆడుతున్న బాబర్ అజామ్‌ను మొయిన్ అలీ ఔట్ చేశాడు. బాబర్ అజామ్ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో హఫీజ్‌కు జత కలిసిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళుతున్నాడు. ఈ క్రమంలో హఫీజ్ అర్థ సెంచరీ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment