రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫిఫ్టి కొట్టిన జడ్డూ
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. వార్మప్ మ్యాచ్‌లో బ్యాట్‌తో దుమ్మురేపాడు. కౌంటీ ఎలెవెన్ జట్టుతో జరగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ(75) చేసిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ(51 రిటైర్డ్ ఔట్) ఫిఫ్టి కొట్టాడు. మరో ఎండ్‌లో ఉన్న హనుమ విహారి(43 నాటౌట్) సైతం రాణించాడు. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 192 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 91 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా 284 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందుంచింది. అనంతరం ఛేదన ప్రారంభించిన కౌంటీ ఎలెవెన్ జట్టు వికెట్ నష్టపోకుండా 10 పరుగులు సాధించింది.
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్ ఆఖరి రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, పుజారాలు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించిన అనంతరం మయాంక్(47) ఔటవ్వగా.. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పుజారా పెవిలియన్‌కు చేరాడు. 34 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. క్రీజ్‌లో విహారి(12), జడేజా(11) ఉన్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 91 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతానికి టీమిండియా 205 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
That will be Lunch on Day 3 of the three-day warm-up game against County XI.#TeamIndia 311 & 113/2, lead by 204 runs. pic.twitter.com/GItTWrcN7X
— BCCI (@BCCI) July 22, 2021
అంతకు ముందు రెండో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో ప్రత్యర్థి జట్టు 220 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/22), మహమ్మద్ సిరాజ్ (2/32) పదునైన బంతులతో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగా, ఓపెనర్ హసీబ్ హమీద్ (246 బంతుల్లో 112; 13 ఫోర్లు) శతకంతో జట్టును ఆదుకున్నాడు. పాటర్సన్ వైట్(33), లిండన్ జేమ్స్(27) కాసేపు పోరాడారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, శార్ధూల్, జడేజా, అక్షర్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్(101), జడేజా(75) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment